Jump to content

పుట:AntuVyadhulu.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

పదమూడవ ప్రకరణము.


రును వీనిని కొని మోసపోక యుందురను నమ్మకముతో నింతగ వ్రాసియున్నాము.

ఇట్టితైలములను,అంజనములను,మాత్రలనుకొని ధనము వ్యయపడ తుదకు పిచ్చియెత్తిన వారలనుగూర్చి మేము వినియున్నాము. అజ్ఞాన దశయందున్న మన దేశమునందిప్పు డితర దేశంబులయందుకంటె నీ దగామందుల బాధయెక్కువగ నున్నట్లు తోచుచున్నది. క్రూరమగు నంటువ్యాధులకు పరిహారముగ నుపయోగించు మందులలో నిట్టివాని నుపయోగింపక తగినవైద్యులచే శోధింపబడిన మందులను మాత్ర ముపయోగింపవలెను. అట్టివానిని కొన్నిటి నీక్రింద వివరించియున్నాము:

నిజముగ శుద్ధిచేయు మందులు

ఇందు కొన్నిటి వెల అధికమగుటచేత వానిని సర్వత్ర ఉపయోగించుటకు వీలులేదు. ఇందుచే ఇండ్లలో నుపయోగించు మందులు వేరుగాను, జలదారులు, మరుగుదొడ్లు మొదలగు వానిని శుద్ధిచేయుటకు కుపయోగించు మందులు వేరుగాను, చేతులు కాళ్లు మొదలగునవి శుద్ధిచేసికొనునవి వేరుగా నుండును.

1. కార్బాలికు ఆసిడ్డు (కార్బాలికామ్లము Carbolic acid). నీళ్లుచేరని కార్బాలికామ్లము చేతిమీద పడిన చేయి కాలి పుండుపడును. చాలనీటితో కలిసియున్నప్పుడు సూక్ష్మజీవులను మిక్కిలి వేగముగ చంపుగుణము దీనియందంతగా