80 వన్ శఠకోపయతులు గలరుగాన యీతఁడు వారినాఁటివాఁడో వారితర్వాతివాఁడో అగుటచే నన్నమయ పుత్రుఁ డగుట నిర్బాధమగును. కవికర్ణరసాయనమున వైష్ణవమతాభిమానము, అద్వైతమత ద్వేషము, అన్నమాచార్య సంకీర్తనచ్ఛాయలు నిలడారుగా నున్నవి. నన్నిచోడ కుమార సంభవమును, ఎఱ్ఱననృసింహపురాణమును, ఉత్తర హరివంశమును, శ్రీనాథరచనలను, ననుకరించునవిగా పలుకుబళ్ళు, కూర్పుతీర్పులు, పద్యచ్ఛాయలు, నిందుఁ జాలఁగలవు. కవిర్ణరసాయనము తాళ్ళపాక నరసింగన్న రచనమే యగుచో నందు రాజాశ్రయగర సహేతుకమే యగును. కారణము సుస్పష్టముకాదు కాని బహువారములు తిరుపతికి విచ్చేయుచు వచ్చినవాఁడు కవి విద్వాసుఁడు కవిపోషకుఁడునగు శ్రీకృష్ణరాయఁడు సంస్కృతాంధ్రవిద్వాంసులు మహనీయులు కవులు గాయకులునగు నరసింహ పెదతిరుమల పినతిరుమలాచార్యాదుల నేలొకోయాదిరింపఁడయ్యెను. పైగా వారి నివాసగ్రామమగు తాళ్ళపాకను వ్యాసతీరుల కగ్రహారీకరించెను. అచ్యుతరాయలవారు మాత్రము తాళ్ళపాకవారి నాదరించి యాదృతుఁ డయ్యెను. పెదతిరుమలయ్యు అన్నమాచార్యుని రెండవభార్యయగు అక్కలాంబయం దీతఁడు జన్మించెను. ఈతనికి నరసమ్మ, తిరుమలమ్మ యుని యిర్వురు చెలియండ్రును గలరు. ఈ తిరుమలాచార్యుఁడు § 1553 దాఁక జీవించినాఁడు. క్రీ 1503 దాఁక జీవించిన యున్నవూర్యుఁడీ పెదతిరుమలయ్య పెదకుమారుఁడగు చినతిరుమలయ్యగారికి బ్రహె్మూప దేశముఁ జేసినాఁడు. 1500 ప్రాంతముల చినతిరుమలయ్యు యపనయనము జరిగిన దనుకొన్నచో 1493 ప్రాంతముల జన్మించిన చినతిరుమలయ్య యువనయనము జరగిన దనుకొన్నచో 1493 ప్రాంతము జన్మించిన చినతిరుమలయ్య తండ్రియప్పటి కిర్వదేండ్లవాఁడే యనుకొన్నను 1473 ప్రాంతముల జన్మించినవాఁ డగును. ఈతని నిండుయావనము శ్రీకృష్ణరాయలవారి కాలమున గడచినది. కృష్ణరాయల
పుట:Annamacharya Charitra Peetika.pdf/82
Appearance