పుట:Annamacharya Charitra Peetika.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

79 లక్షణగ్రంథములందు సుంకసాలనరసింగన్న అని కలదు. సంకుసాల అని లోకమునూడుక. "సుంకేసుల" అని గ్రామములు రాయలసీమలో నున్నవి. కI ఇంకా నవ్వే వచ్చే సుంకేసుల మ్రానిక్రింది సుద్దులు దలఁపన్ లంకించుకొన్న రాజవు వెంకటగిరివాస ! విబుధవినుతవిలాసా ! క టెంకాయ చిప్పలోపల వంకాయా పెసరపప్ప పరివంటకమున్ ఇంకాఁ బెట్టేఁ దినరా వెంకటగిరివాస ! విబుధవినుతవిలాసా ! ఇత్యాదిగా నెవరు రచించినవో రుచిగల కందపద్యములు గొన్ని శ్రీవెంకటేశ్వరస్వామిపేరనున్నవి. సుంకసాల సంకుసాల సుంకేసులలు ఒకయూరిపేరి వికారములేమో ! కృష్ణరాయఁడు తాళ్ళపాక గ్రామమును వ్యాసతీరులవారి కగ్రహారీకరించుటచే నరసింగన్న తాళ్ళపాక విడిచి పైగ్రామము చేరి నుంకసాల యింటి పేరివాఁ డయ్యెనేమో! కవి కర్ణకసాయనమున నాతఁడు తనకులగోత్రములను దలిదండ్రులను బేర్కొనఁ డయ్యెను.గ్రంథాదిని 'గురువరభట్టపరాశరచరణ సరోరుహ సముల్లసన్నాననుఁడన్' అని గురుస్తుతి చేసినాఁడు. 'ఆదిమశఠకోపాది' తుదిని 'ఆదిమశఠకోపాది' అని యాశ్వాసాంత పద్యమునఁ జెప్పినాఁడు. వీనినిబట్టి యాతఁడు, భట్ట పరాశరాహ్వయుని శిష్యుఁడనీ, రెండవ శఠకోప యతియైన-యహెూబలమఠ ప్రతిష్టాపకవన్ శఠకోపయతి నెఱిఁగిన వాఁ డనీ గుర్తింపనగును, వేదాంతదేశికుల శిష్యులు, బ్రహ్మనూత్ర గీతావ్యాఖ్యాతభట్టపరాశరు లొకరు గలరుగాని అయినను రామానుజుల నాఁటి పరాశరభట్టారకుల వంశజులందఱకు పరాశరభట్ట నామము సాధారణ మనికూడ వాడుకగలదు. క్రీ. పదునైదవ శతాబ్దియత్తరార్ధమున