Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

81

పరిపాలన కాలమున నీతఁడు శ్రీవెంకటేశ్వరస్వామికిఁ గొన్నికైంకర్యములు జరపినను నందు సాళ్వతిమ్మరుసును నాతని తమ్ముఁడగు గోవిందయ్యయు నిర్వాహకులుగా నుండిరి. ఆశాననములలో శ్రీకృష్ణరాయలపేరు లేదు. పెదతిరుమలయ్యకును నాతని యన్నయగు నరసింహకవికిని శ్రీకృష్ణరాయనితో వైరస్యము గల దనుకొనుట కింకొక సాధనము:-

“మండెమురాయనామక నరసింహ దండనేత్రు (తృ?)న కిష్టధనబలస్పూర్తి" నని యన్నమాచార్య చరిత్రముననున్న వాక్యమునకు మండెము రాయఁడను నామాంతరముగల నరసింహ దండనాధుఁ డని యర్ధముగావచ్చు నని యనుకొంటిమి. (చూ.పుట. 286)

పయిమండెము కడపమండలము చినమండెము అనీ, చిత్తూరు మండలమున గాజులమండెము చిఱుమండెము అనీ కలగ్రామములలో నొకటయి యుండఁబోలును. ఆయూర పెదతిరుమలయ్య నెవరో కత్తితో నఱకిరట. ఆకత్తివ్రేటాతనికిఁ గలువదండ యైనదట !


"మండెము కోటలో మండలం బెఱుఁగ
మండలాగ్రాహతి మహనీయ పుష్ప
దామమై ధర్మాంగదస్థితిఁ బొలిచె
నేమహామహుని యహీనగాత్రమున”


నని చిన్నన్న చెప్పినాఁడు. దేవకీపురవాస్తవ్యుఁడగు నరసింహదండనాథుఁ డిందు ప్రయోజకుఁడేమో! ఈ విషయము పెదతిరుమలాచార్యుఁడే యిట్లు సంకీర్తనమునఁ జెప్పుకొన్నాఁడు.


శంకరాభరణ


      నాఁటికి నాఁడు గ్రొత్తనేఁటికి నేఁడు గ్రొత్త !
      నాటకపుదైవమవు నమో నమో. ॥పల్లవి॥
సిరుల రుక్మాంగదుచేతికత్తిధార దొల్లి ।
వరుసధర్మాంగదుపై వనమాలాయ ।