75
దొలుత శ్రీనాథుఁడే యక్షగానములఁ బేర్కొన్నవాఁడు. దాక్షారామమున సంగీత నాట్య విద్యా వినోదములు జరుగుట నాతఁడు వర్ణించినాఁడుగాని యానాఁటిగేయుము లేవొ సరిగాఁ దెలియరావు. చాళ్యుక్యరాజుల గ్రంథములలో (అభిలషితార్థచింతామణి, సంగీత చూడామణి) సంగీతవిషయములు చాలఁ గలవుగాని వానిలో వర్ణితము లయిన సంగీతప్రబంధము లంతముఖ్యమయినవి గావు. ఏలలు ధవళములు చర్చరులు ఏకతాళులు శరభలీలలు చిందులు మొదలయినవేవో కొన్ని మాత్రమే చిన్నచిన్ని రచన లందుఁ జెప్పఁబడినవి. అందు గొన్ని నేఁడును వాడుకలో నున్నవి. వానిని గూర్చి యభిలషితార్థచింతామణి సంగీతచూడా మణులలోని ముక్కలు కొన్ని:-
“కథాసు షట్పదీ యోజ్యా వివాహే ధవళ స్తథా
ఉత్సవే మంగళో గేయ శ్చర్యా యోగిజనై స్తథా"
"పదేపదే భవే ద్రాగః తాళ శ్చాన్యః పదేపదే
పదాస్తే స్వరతాళాభ్యాం గేయ శ్శరభలీలకః"
"షోడశమాత్రాః పాదేపాదే యత్రభవస్తి నిర స్తవివాదే! పద్దళికా జగణేనవియుక్తా చరమగురు స్సా సద్బిరిహెూక్తా"
"రాగో హిందోళక స్తాళః చర్చరీ బహవోంఘ్రయః యస్యాం షోడశమాత్రాస్సు ర్ద్వౌ ద్వౌచ ప్రాససంయుతౌ సా వసంతోత్సవే గేయా చర్చరీ ప్రాకృతైఃపదైః"
"పద మన్త్యంసమాదాయ యమకస్థితిభూషితః ఆవృత్యాగీయతే యస్తు చక్రవాళ స్ప ఉచ్యతే
గద్యేవా పద్యబంధేవా పుణ్యనామాంతశోభితః నామాంతే స్వరసంయుక్తో గీయతే చక్రవాళకః"
లక్ష్యమ్
శశాంకశకలం కలంకికుముదం ముదం నవహతే హతే హిమకరే
కరే తదసమం సమంవివసితం సితంవిజయతే యతే తవయశః.