74 యనవలెను. తుమ్మెదపదములు, ప్రభాతపదములు, పర్వతపదములు, ఆనందపదములు, శంకరపదములు, నివాశిపదములు, వాలేశుపదములు, గొబ్బిపదములు, వెన్నెల పదములు, సెజ్జవర్ణన గణవర్ణనపదములు, పాల్కురికిసోమనాథుఁడు తనగ్రంథములలోఁ బేర్కొన్నాఁడుగాని యవి యిప్పడు గానరావు. అవి యేవో పొడిపొడిగా వెలసినలఘురచనలయి యుండునుగాని ప్రఖ్యాతకవ లానుపూర్వితో రచించినవిగావేమో! త్యాగ రాయలకృతులకుఁ బూర్వ మాంధ్రగాయకు లాలాపించుచుండిన గేయములే వి? యుని పరిశీలింపఁగాఁ జాలినంత సమాధానము దొరకకున్నది. నేఁటిగాయకు లందఱును ద్యాగరాయాదులను నూతేండ్ల క్రిందటి వారినే యెఱుఁగుదురు. సింగభూపాలుఁడు పెదకోమటివేమారెడ్డి ఫ్రాడదేవరాయఁడు (సంగీతరత్నాకరః అనఁబడినాఁడు) సంగీతగ్రంథకర్తలు అన్నమాచార్యుని కించుకపూర్వులు. బయకారరామామాత్యుఁడు, కృష్ణరాయఁడు అచ్యుతరాయఁడు తిరుమలరాయఁడు, సంగీతగ్రంథములకుఁ గర్తలు, కారయితలును. వెంకటగిరి కాళహస్తి కార్వేటినగరము నూజివీడు చల్లపల్లి ముక్త్యాల పిఠాపురము పెద్దాపురము విజయనగరము గద్వాల వనపర్తి ఆత్మకూరు మొదలగు రాజాస్థానములు సంగీత వినోదము లేనివి గావు. దక్షిణాంధ్రరచనలలో తంజాపుర్యాదులలో వెలసినగీయరచనలు సురక్షితములుగా నున్నవిగాని తెలుఁగుదేశపు రచనలు ససిగా దొరకుట లేదేల? కృష్ణరాయలమీఁదిగేయరచన లైనఁ గానరావే. ఆనుపూర్వితో క్షేత్రయపదములు ఏగంటిచిలుకపాటి పదములు రామదాసుకీర్తనలు ముత్తేవివారికీర్తనలు తాడంకి వారికీర్తనలు నల్లబాటివారికీర్తనలు సారంగపాణి పదములు గుత్తెనదీవిరామాయుణకీర్తనలు అధ్యాత్మ రామాయణకీర్తనలు శోభనాద్రీశ్వరసంకీర్తనలు నని కొన్నిగలవు గాని యవియెల్ల నంతప్రాచీనములు గావు. మద్రాసుప్రాచ్యలిఖితపుస్తకశాలలోఁ గొన్ని పొడి పొడి గేయరచన లున్నవిగాని యందుఁ గొన్ని ప్రాచీనతరము లయినను గావచ్చునుగాని యవి యానుపూర్వితో కర్తృనామాంకముతో లేవు. యక్షగానములు గొన్ని వానిలోనిగేయరచనలు గొన్ని కలవుగాని మొదటి కొయక్షగానములే యంతప్రాచీనములు గావు. తెలుఁగునఁ
పుట:Annamacharya Charitra Peetika.pdf/76
Appearance