76
"నిరంతర మనుప్రాసో యతి ర్యత్ర పదేపదే
క్రియతే గీతత్త్వజైః సా స్మృతా త్వేకతాళికా"
“ధవళాది పదైః పాదై రాశీర్వాదసమన్వితైః
ఛందసా యేనకేనాపి కర్తవ్యో ధవళాభిధః"
పై గ్రంథములలో లక్ష్యములు గొన్ని కర్ణాటభాషలో నున్నవి. చాళు క్యులు కర్ణాటకు లగుటచేతను రాజులగుటచేతను తొలుత సంగీత సంప్రదాయ మధికముగాఁ గన్నడమున బెంపొందించియుందురు. మొదటి కీగానమునకే కర్ణాటగాన మని పేరయ్యెను. సంగీతశాస్త్రమున స్వరపద్ధతికి ధాతు వని సాహిత్యపద్ధతికి మాతు వనిపేరు. శరీరమున సప్తధాతువు లుండుటఁ బట్టి తత్సాదృశ్యమున సప్తస్వరములకు ధాతుసంజ్ఞ కుదిరెను. 'మాతు' కర్నాటభాషాపద మనుకొందును. మాతు=మాట ఈ శాస్త్రము తొలుత కర్ణాటమున వెలయుటచే సాహిత్యమునకు 'మాతు' అన్నకర్ణాటపదము గొనుటయ్యెను గాఁబోలును.
పై లక్షణ శ్లోకములలో నున్న చర్చరియే జాజఱ యయినది. అన్నమాచార్యనంకీర్తనములలోని జాజఱపాట లన్నియు గోవాళ్ళు వసంతోత్సవములోఁ బాడునవిగా నున్నవి. ఒకటి:-
ముఖారి
చాలుఁ జాలు నీజాజఅ, నన్ను
జాలిఁ బఱచె నీజాజఱ ||పల్లవి||
వలపువేదనల వాడేను యీ !
తలనొప్పలచే తలఁకేను !
పులకలమేనితో పొరలేను కడు !
జలిగొని చల్లకు జాజర ||చాలు|| 1
వొల్లని నినుఁ గని వుడికేను నీ
చిల్లరచేఁతలఁ జిమిడేను !
కల్లగందవొడిఁ గాగేను పైఁ!
జల్లకు చల్లకు జాజఱ ||చాలు|| 2