69
అంతకుఁబూర్వమే యీస్థలమాహాత్మ్య సముచ్చయము కల దని నిరూపింపఁగల సాధనములు గానరా నంతవఱకు నిది యన్నమాచార్య రచితమని తలఁచుట యసంగతముగాదు. ఇప్పుడున్న పురాణములలోని వేంకటాచలమాహాత్మ్య భాగములు వేర్వేఱు రచనము లనుకొన్నచో నందుఁగొన్ని యయినను నీతని రచనములు గావచ్చును.
వరాహబ్రహ్మాండములలో వేంకటేశ్వర విషయ మున్న ట్టీక్రింది సంకీర్తనమున నన్నమాచార్యఁడో పెదతిరుమలాచార్యుఁడో చెప్పినాఁడు.
బౌళి
శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడె !
పావనపు వైకుంఠపతియును నితఁడె ॥పల్లవి॥
భాగవతములోఁ జెప్పె బలరాము తీర్థయాత్ర !
నాగమోక్తమైన దైవత మాతం డితఁడె !
బాగుగా బ్రహ్మాండ పురాణపద్ధతియాతఁ డితఁడె !
యోగమై వామనపురాణోక్తదైవ మీతఁడె ॥శ్రీవేంక॥ 1
వెలయు సప్తఋషులు వెదకి ప్రదక్షణము !
లలరఁ జేసినదేవుఁ డాతఁ డితఁడె !
నెలవై కొనేటిపొంత నిత్యముఁ గూమారస్వామి !
కలిమిఁ దపము సేసి కన్న దేవుఁ డితండి ॥శ్రీవేంక॥ 2
యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు !
తక్కకు కొలిచియున్న తత్వ మీతఁడె !
చక్క నారాదాదుల సంకీర్తనకుఁ జొక్కి :
నిక్కిన శ్రీవేంకటాద్రి నిలయుఁడు నితఁడె ॥శ్రీవేంక॥ 3
అన్న, అధ్యా. 87 ఱేకు
నేఁటి వేంకటాచలమాహాత్మ్యకథలు సంకీర్తనములలో నంతగాఁ గానరాకున్నవి. కొన్ని స్థానికదేశిగాథ లున్నవి. (చూ. 25 పీఠక పుట.)