70
ఇతరగ్రంథములు
అన్నమాచార్యుఁడు పండ్రెండు శతకములు రచించెనట. సకల భాషలందును ప్రతిలేని నానాప్రబంధములు రచించెనట.
అన్నమాచార్యుని వేంకటేశ్వరశతక మొకటి నేను ప్రకటించిన ప్రబంధ రత్నావళిలో నుదాహృతమయినది. దేనస్థానపు రాగిరేకులలోఁ గానరాదు. అలమేల్మంగాంబమీఁద నీతఁడురచించిన శతక మిదే (చూ.పీఠిక 16పు.). మఱి మిగిలిన పదిశతకములు నేయేవేల్పులమీఁద రచితము లయ్యెనో, వాని పేళ్ళేమో తెలియరాదు. ఇవిగాక యన్నమాచార్యుఁడు సంస్కృతమున సంకీర్తనలక్షణము రచించినట్టును దానికిఁ దనతండ్రి పెదతిరుమలా చార్యుఁడు వ్యాఖ్య చెప్పినటును వాని ననుసరించి తాను తెలుఁగు రచన చేసినట్లును జెప్పకొన్నాడు. ఆ సంస్కృత సంకీర్తన లక్షణమును గానరాదు.
అన్నమాచార్య విగ్రహము
సంకీర్తనభండార మనీ తాళ్ళపాకవారి యర అనీ, పేర్కొనఁబడు చుండుకొటు నరిగా భాష్యకారుల సన్నిధికిఁ బ్రక్కగా నున్నది. స్వామిదర్శనము చేయువారు బంగారువాఁకిటికడ నిలిచి ముందుచూచిన స్వామిదివ్యవిగ్రహమును గుడిచేతి ప్రక్కకేసి చూచిన భాష్యకారుల విగ్రహమును గానఁగలుదురు. భాష్యకారులతోపాటు దర్శనీయులుగా నన్నమాచార్యుల విగ్రహము సంకీర్తనభండారము ద్వారమునెడమప్రక్క నున్నది. ఆద్వారమునకుఁ గుడిప్రక్కను పెదతిరుమలాచార్యుల విగ్రహమును గాననగును. బంగారువాకిలిదగ్గఱనుండి ఒకకంట స్వామిని ఇంకొక కంట భాష్యకారులను (చిదంబరమున కనకనభాపతిని, వరదరాజులను దర్శించునట్లే) అన్నమాచార్యుని తత్పుత్రునిగూడ దర్శింవనగును. నరిగా నీయర్ధమును నిరూపించునదిగాఁ జినతిరుమలాచార్యుఁడుగాఁబోలును రచించిన సంకీర్తనము లున్నవి.
అఱిముఱిఁ జూడఁబోతే నజ్ఞాని నేను !
మఱఁగు సొచ్చితి మీకు మహిలో నారాయణా ||పల్లవి||