68
దుపలభ్యమాసము లగుటచే ముద్రితముల యినయష్టాదశ పురాణము లలో నాయాస్థలపురాణములు నూటికిఁ దొంబది తొమ్మిదివంతులు గానవచ్చుటే లేదు. పురాణపుముద్రాపకులు కొన్నిస్థలపురాణములను నేఁటిపురాణ ముద్రణములందుఁ జేర్చుటయు జరగకపోలేదు. అది యొక మహత్తరచర్చ అధ్యాయ సంఖ్యలు, పురాణముల పేళ్ళఉన్ననునేటిస్థల పురాణము లెల్ల నాయాపురాణములలో దొలుత రచితములు గా వనుట ప్రఖ్యాతనత్యార్ధము. ఇంచుమించుగా నిట్టిస్థలమాహాత్మ్యములు పదుమూఁడు పదునాల్గు శతాబ్దములనుండి నిన్నటినేఁటి దాఁకగూడ నుప్పతిల్లుచునే యున్నవి. కాన అన్నమా చార్యుఁడు రచించినాఁ డన్న వేంకటాచలమాహాత్మ్య మిప్పడు ప్రఖ్యాతముగానున్న వేంకటాచల మాహాత్మ్యము కావచ్చుననుట విడ్డూరపడవలసిన విషయముకాదు. ఆతఁ డేదో నంన్కృతవు ననునరించి తెల్గున నలవూహాత్మ్యవు రచించెననఁగాదు. "దివ్యభాష ! నా వేంకటాద్రిమాహాత్మ్యమంతయును రచించె" నని కలదు. జియ్యర్ రామాను జయ్యంగా రనువారు క్రీ. 1491 నాఁడు (అప్పటి కన్నమాచార్యుఁ డఱువది యేడేండ్లవయసువాఁడు) తాను విన్నపముచేసిన తిరువేంకటాచల మాహాత్మ్యమునకు శ్రీ స్వామివారు స్వీకారము చిత్తగించి ఆలకింప ననుగ్రహించునట్లు చేయుటకును, గొన్ని యుత్సవములు జరుపుటకును ఉభయముగాఁ గొంత ద్రవ్య మొుసఁగి స్థానాధిపతులచే శిలాశాసనము చెక్కింపించుకొన్నారు.[1] ఆ రామానుజ జియంగారు కవీశ్వరుఁడయిన యున్నమాచార్యునిచే వేంకటాద్రి మాహాత్మ్యమును రచింపించి తననమర్పణముగా స్వామి సన్నిధిని విన్నపింవఁ గోరియుండవచ్చును. పెదతిరుమలాచార్యుఁడు స్వామినన్నిధిని వేంకటాచల మాహాత్మ్యమును బఠించుటకుఁగాను అనంతాచార్యు లనువారికిఁగొంత జీవిక యేర్పఱిచెనట. అది పితృదేవరచితమన్న యభిమానముచేఁ జేసిన దయినఁ గానశచ్చును. ———————————————————————————————————————————
- ↑ చూ, తిరుపతి శిలాశాసనముల వాల్యుం : నెం 95 శాసనము.