Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

దినమున కొక సంకీర్తనము చొప్పన సంకీర్తనములు రచించిన టున్నది.[1] అట్లు లెక్కింపగా నించుమించుగా నిర్వదిమూఁడువేల సంకీర్తనములు లెక్కకు వచ్చును. ఇందు ముప్పదిరెండువేల సంకీర్తనములు రచించిన టున్నది. "పరమతంత్రమ్ములిర్వదిరెండువేలు" అనియుండ వలెనో, కానిచో ఆరాగిరేకు మీఁదివాక్యమునకుఁ బ్రతిదినము నొక్కదానికిఁ దక్కువ కానీక సంకీర్తనములు రచించుచుండె నని యర్ధము చెప్పికొన వలెనో రెండవ తీరనుకొందుమేని ముప్పది రెండువేల సంకీర్తనములు రచించె ననుట సంగతమే. రచించిన యా సంకీర్తనములెల్ల రాగిరేకుల కెక్కనే లేదో? ఎక్కినను నిప్పడు మనకు దొరకలేదో? తిరుపతి దేవస్థానమునఁ గాక అహెూబలమునకుఁ గొన్ని రేకులు చేరియున్నట్లు తెలియుచున్నది గదా. ఇంక నెన్ని యెప్పడెక్కడికిఁజేరినవో? క్రీ 1560 ప్రాంతములదాఁక సంకీర్తనములను రాగిమీఁదఁ జెక్కించుట జరగిన టున్నది. విద్యానగర విప్లవముమూలమున దక్కిన వానిఁ జెక్కించుట సాగక తాళపత్రముల మీఁదనే యుంపఁగా కాలవశమున నవియుఁ జెడియండును. 1560 క్రీ. పూర్వమే కొన్నిసంకీర్తనములు తంజావూరికిఁ జేరియుండును. అక్కడఁ గలసంకీర్తనము లన్నియుఁ దిరుపతి రాగితేకులమీఁద నున్నవో లేవో? శేషాచార్యులవారి తాళపత్రప్రతిలోని సంకీర్తనములు గూడ నన్నియు

రాగితే కులమీఁది కెక్కినవో లేవో? పెదతిరుమలాచార్యుఁడుగూడ దినమున కొకసంకీర్తనము చొప్పనఁ దండ్రియానతిని రచించెను. అవి కొన్నివే లుండవలెనుగదా ! కానరావు.

ద్వివదరామాయణము

అన్నమాచార్యుఁడు ద్విపదముగా నవముగా రామాయణమును గూడ రచించెనట. ద్విపదరచన మంతకుముం దింకొకటి కల దని సూచించుటకు నవముగా ననుట. ఈతని రామాయణరచనము నేఁడు గానరాదు కాని రామాయణ కథాప్రసక్తములు సంకీర్తనము లనేకము

———————————————————————————————————————————

  1. (చూ) అన్నమాచార్యుల శృంగార సంకీర్తనముల మొదటి తేకు. అధ్యాత్మ సంకీర్తనముల మొదటి తేకు.