Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65

కమలధరుఁడును కమలపుత్రుఁడు కమలశత్రుఁడు పుత్రుఁడు !
క్రమముతో మీకొలువు కిప్పడు కాచినా రెచ్చరికయా ||శర||

అనిమిషేంద్రులు మునులు దికృతు లమర కిన్నర సిద్ధులు !
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా ||శర||

ఎన్నఁగల ప్రపదముఖ్యులు నిన్నుఁ గొలువఁగ వచ్చిరీ !
విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచల నాయకా ||శర||

భజనపద్ధతిలో అన్నమార్యునిదిగా నాఁటనుండి నేఁటిదాఁక సాగుచున్న యీ పై సంకీర్తమును జదివి పురందరదాసుగారి యీ క్రింది సంకీర్తనమును గూడఁ జదువుఁడు.

మాళవి రాగం

శరణు శరణు సురేంద్ర వందిత శరణు శ్రీపతిసేవిత !
శరణు పార్వతితనయ మారుతి శరణు సిద్దివినాయక ||పల్లవి||

నిటలనేత్రన దేవిసుతనె నాగభూషణప్రియనె !
తటిల్లతాంకిత కోమలాంగనె కర్ణకుండల ధారనె ||శర||

బటువు ముత్తిన పదకహారనె బాహుహస్తచతుష్కనె !
ఇట్టితొడగియు హేమకంకణ పాశ అంకుశ ధారనె ||శర||

కుక్షియోుళు మహాలంబోదరనె ఇక్షుచాప గెలిదనె !
పక్షివాహన నాద పురందరవిట్టలన నిజదాసనె ||శర||

అన్నమాచార్యులవారి సంకీర్తనచ్ఛాయనే పురందరదాసులవారి కీర్తన మున్నది.

నంకీర్తననంఖ్య

అన్నమాచార్యుఁడు యోగవైరాగ్య శృంగార మార్గములలో ముప్పది రెండువేల సంకీర్తనములఁ జెప్పెనని కలదు. (చూ. 45 పుట.) అతఁడు తనవదునాజేండ్లవయసున నుపక్రమించి దివ్యధామ మందుదాఁక