పుట:Annamacharya Charitra Peetika.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

67 లున్నవి. రాగిజేకులమీఁద నన్నమాచార్యుల సంకీర్తనములను శృంగార మంజరిని మాత్రమే తత్పుత్రుఁడు పెదతిరుమలాచార్యుఁడు చెక్కించెను గాఁబోలును.' వేంకటాచలమాహత్మ్యము సంస్కృతభాషలో శ్రీవేంకటాచలమాహాత్మ్యము నన్నమాచార్యుఁడు రచించెను. (చూ. 46 పుట) వరాహపురాణాదులలోనిదిగా సంఘటిత మయి పదునేడు పదునెనిమిది శతాబ్దముల పిదప తెలు పరివర్తనము పడసి ప్రాచీనతాళ పత్రప్రతులు గలిగి యిప్పడు నాగరాంధ్రాక్షరములలో ముద్రితమై వ్యాప్తిగాంచియున్న వేంకటాచలమాహాత్మ్యము నాఁడు తాళ్ళపాక యన్నమాచార్యుఁడు రచించినది యయినను గొవచ్చును. అష్టాదశపురాణములలోఁ జేరినవిగాఁ గానవచ్చు స్థలమాహాత్మ్యముల నన్నింటిని సమకూర్చి గ్రంథసంఖ్యను గణించినచో నష్టాదశపురాణము లకుఁ బ్రాచీనులే పరిగణించిన గ్రంథసంఖ్యకంటె నీస్థల మాహాత్మ్యముల గ్రంథసంఖ్య చాల మీజీపోఁగలదు. వ్రాఁతప్రతులు గలిగి పురాణక్రమ నిర్వచనమునఁ జెప్పఁబడిన యానుపూర్విగలిగి యనేక స్థలములం 1. తిరుపతి దేవస్థానమునగల రాగిరేకులలో నన్నమాచార్యుల రచనము లనుకొనఁదగినవి యించుమించుగా రెండువే లుండును. అన్నమాచార్యుని సంకీర్తనముల తొలిరేకున నామాంకముగలిగి ఒకటి,రెండు, మూడు, నాలుగు, ఇత్యాది క్రమసంఖ్యాంకములతో రేకుల యడ్డము నిడుపుల సమపరిమాణముతో నున్నరేకుల సంఖ్యను ఇంచుమించుగా రేకున కాఱు పాటల చొప్పననున్న పాటలసంఖ్యను, ఒరిగణించి యీ మొత్తము గుర్తింపఁగల్గితిమి. అట్లే తొలిరేకుపై పెదతిరుమలాచార్యుల నామాంకముతో 1, 2, 3, సంఖ్యాక్రమముగల రేకులను వానియడ్డము నిడుపుకొల్లల పృథక్త్వమును గమనించి పెదతిరుమలాచార్యుల సంకీర్తనముల నంఖ్యను, చినతిరుమలాచార్యుల సంకీర్తనముల నంఖ్యను గుర్తింపఁగల్గితిమి. కాని, యన్నమాచార్యులరేకులని కొల్లలపరిమాణము, సంఖ్యానుపూర్వియుగల రేకులలో(గూడఁ గొన్ని యున్నమాచార్యప్రనక్తములు తత్పుత్రుఁడో పౌత్రుఁడో రచించినవికూడఁ గల సెఁగాఁ బోలునని కొన్ని సంకీర్తనములలోని విషయములఁబట్టి సందేహింప నవకాశముకలిగినది.