58
పెండిలికిఁ బరుషలఁ బిలువఁగ నంపినటు |
అండనె ముందరఁ గంత కంపినయట |
వెండియు శ్రీవెంకటేశ వెంట వచ్చి మరలితి |
వుండుచోటనుండి నన్ను వూడిగాన కంపవే || రామ || 3
అన్న అధ్యా. 275 ఱేకు.
అన్నలజోల
అన్నమాచార్యుఁడు శృంగారమంజరి[1] యనుమంజరీచ్ఛందోమయ రచనను భాషచే భావముచే శృంగారసుందరమైనదానిని శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై రచింపఁగాఁ జిత్తగించి స్వామి యన్నమాచార్యు ని ట్లను గ్రహించెను. (చూ. పుట. 41.)
శృంగారమంజరిఁ జేసి శేషాద్రి
శృంగవాసునకు నర్పించి యిచ్చుటయు
నాడుచుఁ బతకమా కన్నల జోల
పాడఁగ నాఁడెల్ల బసిబిడ్డ నైతి
నాకృష్ణమాచార్యు నధ్యాత్మవినుతి
రాకఁ గొన్నాళ్ళు విరక్తుండ నైతి
జగతి నీశృంగార సంకీర్తనముల
కగపడి మంచిప్రాయపువాఁడ నయితి
నని వెంకటేశ్వరుఁ డన్నమాచార్యుఁ
గనుఁగొని వాక్రుచ్చి గారవించుటయు
పైగ్రంథభాగమునఁ దొలుత పతకమాకన్నలజోల తర్వాత కృష్ణమాచార్యునధ్యాత్మవినుతి కలవు. కృష్ణమాచార్యుఁడు కాకతీయ ప్రతాప రుద్రునినాఁటివాఁడు. కాన యూతని వినుతికి ముందు గల పతకమా కన్నలజోల యంత కింకను బ్రాచీనము కాఁబోలును అది యెట్టిదో యొక్కడేని కలదేమో తెలియఁజాలకున్నాను. వాక్యము సరిగానున్నదో లేదో ————————————————————————————————————————
- ↑ ముద్రితము. తాళ్ళపాకరచనలు 1 వాల్యుం.