59
కూడఁ దెలియదు. పతకమూక ఊరిపేరోమో! అది పతకమాకో లేక పతకమూరో పొతకమూరో ఇంకేదో ఆయూరివాఁడయిన అన్నలు అనుగేయకవి జోలపాట రచించియాడుచు నొండె స్వామి బాలుఁడై యూడఁగానొండెఁబాడెడివాఁ డని యర్ధము. కాఁబోలును. పయిపతక మాకయున్నలజోల సుప్రఖ్యాతమయి తాళ్ళపాక వారు మెచ్చినదయి యుండును.
రాగిఱేకులలో అన్నమాచార్యుఁడు రచించినవే యనేకములు జోల లున్నవి. వేలకొలఁదిగా నున్నయూశృంగారనంకీర్తన లెల్ల నిఁక సుపరిశోధితములు ముద్రితములును గావలసియున్నవి.
అన్నమయుజోల
ఇటీవల నొక జోలపాటను లోకమున వ్యాపించిన దానిని నన్నమా చార్యుని పేర నుండుట గుర్తించితిని.[1]
రాగం. ఆటతాళం
జో వచ్యుతానంద జోజో ముకుంద !
రావె పరమానంద రామగోవింద ||జో||
***
అంగజునిగన్న మాయన్న యిటు రారా !
బంగారుగిన్నెలోఁ బాలు పోసేరా !
దొంగ నీ వని సతులు పొంగుచున్నారా !
ముంగిట నాడరా మోహనాకారా ||జో|| 1
గోవర్ధనం బెల్ల గొడుగుగాఁ బట్టి !
కావరమ్మున నున్నకంసుఁ బడగొట్టి !
నీవు మధురాపురము నేలఁ జేపట్టి !
ఠీవితో నేలిన దేవకిపట్టి ||జో|| 2
—————————————————————————————————————
- ↑ శ్రీవిస్సా అప్పారావుగారి యింట వారి పూర్వులు వ్రాసియుంచుకొన్న మంచి సంకీర్తనముల సంచయములోనిది. చిరంజీవి తి. కోదండరామయ్య ఆంధ్ర 8-9-48 వార పత్రికలోఁ బ్రకటించెను.