54
ఆచార్యునికి నంకెల
రాయఁ డన్నమాచార్యునికి మూరురాయరగండ మని పేరుగల సంకెలవేయించి చెరసాలలోఁ బెట్టించెను. "సంకెల లిడువేళఁ జంపెడువేళ నంకిలి ఋణదాత లాఁగెడువేళ" ఇత్యాదిగా నాతఁడు సంకీర్తనము చెప్పి సంకెల విదలించుకొన్నాడు. (చూ. 38 పుట.)
ముఖారి
ఆఁకటివేళల నలపైనవేళలను
తేఁకువ హరినామమే దిక్కు మఱిలేదు ॥పల్లవి॥
కొఱమాలి వున్న వేళ కులము చెడినవేళ !
చెఱవడి వొరులచేఁ జిక్కినవేళ !
వొఱపైన హరినామ మొక్కటే గతిగాక !
మఱచి తప్పిన నైన మఱిలేదు తెఱఁగు ॥ఆఁక॥ 1
ఆపద వచ్చినవేళ నాఱడిఁ బడినవేళ !
పాపపువేళల భయపడినవేళ !
వోపినంత హరినామ మొక్కటే గతిగాక !
మాపుదాఁగాఁ బొరలిన మఱిలేదు తెఱఁగు ॥ఆఁక॥ 2
సంకెలఁబెట్టినవేళ చంపఁ బిలిచినవేళ !
అంకిలిగా నప్పులవా రాఁగినవేళ !
వెంకటేశు నామమే విడిపించ గతిగాక !
మంకుబుద్ధిఁ బొరలిన మఱిలేదు తెఱఁగు ॥ఆఁక॥ 3
అన్న. అధ్యా. 26 ఱేకు.
దేసాక్షి
నీదాసులభంగములు నీవు చూతువా !
యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా ॥పల్లవి॥
పాలసముద్రముమీఁదఁ బవళించినట్టి నీకు !
బేలలై సురలు మొఱవెట్టినయట్టు !