55
వేళతో మామనవులు విన్నవించితిమి నీకు !
యేల నిద్దిరించేవు మ మ్మిట్టే రక్షించరాదా ॥నీదాసు॥ 1
ద్వారకానగరములో తగ నెత్తమాడే నీకు !
బీరాన ద్రౌపది మొర వెట్టినయట్టు !
ఘోరపు రాజసభలఁ గుంది విన్నవించితిమి !
యేరీతి పరాకు నీకు నింక రక్షించరాదా ॥నీదాసు॥ 2
ఎనసి వైకుంఠములో నిందిరఁ గూడున్న నీకు !
పెనఁగి గజము మొరవెట్టినయట్టు !
చనవుతో మాకోరిక సారె విన్నవించితిమి ॥
విని శ్రీవెంకటేశుండ వేగ రక్షించరాదా ॥నీదాసు॥ 3
అన్న. అధ్యా. 247 ఱేకు.
సామంతం
దాసవర్గముల కెల్లా దరిదాపు మీరే కాన !
వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును ॥పల్లవి॥
సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా !
శ్రీనాథునికి నేము సేసేవిన్నపము !
ఆనుక భాష్యకారులు అట్టే మీరుం జేయరాదా!
మానక విన్నపముల మామనవి చనవులు ॥దాస॥ 1
వేయినోళ్ళభోగి నీవు విన్నపము సేయరాదా !
వేయేసి మావిన్నపాలు విష్ణునికిని !
ఆయితమై గరుడండ అట్టే మీరుం జేయరాదా !
యేయెడ విన్నపము మాకేమి వలసినాను ॥దాస॥ 2
దేవులమ్మ యిందిర మాదిక్కె విన్నవించరాదా !
శ్రీ వెంకటపతికి చిత్తమందను !
ఆవేళ శేషాచలమ అట్టే మీరుం జేయరాదా !
యీ వేళ మావిన్నపము లీడేరే నింకను ॥దాస॥ 3
అన్న. అధ్యా 247 ఱేకు.