50
యన్నమాచార్యుఁడు నరసింగరాయాదులవల్ల నార్జించి యుండును. అన్నమాచార్యచరిత్రలో 43 పుటలో ని ట్లున్నది. "వెంకటాద్రిచెంగటను తనయగ్రహారమై తరుచునున్న[1] మరులుంకు (?) నొకజీడిమామిడిదాన"
అన్నమాచార్యుఁడు రాజసముతోఁ జాల వైభవముతోఁ గొన్నాళ్ళు వెలుఁగొందెను. (చూ 35 పుట).
అన్నమయ శృంగారకీర్తనలు
ఈ రాయఁడు మరల నన్నమాచార్యుని నొకనాఁడు పిలిపించి స్వామివారిపై రచించిన శృంగారసంకీర్తనములు గొన్ని పాడవేఁడెను. అన్నమయ పాడెను. (చూ పుట 36) అందు:-
చెలులార వెంకటశిఖిరినాయకుని “కలికికిఁ గడగంటఁ గనుపట్టునెఱుపు చెలువ మేగతి నుండెఁ జెప్పరే" యనిన "నలువునఁ బ్రాణేశునాటిన చూపు నిలువునఁ బెఱుక నూనిన శోణితంబు తలపోయఁ గాదుగాదా యన్నపదము పలుమఱుఁ బాడించి పాడించి చొక్కినాఁ" డట.
అశృంగార సంకీర్తనమిది.
నాదనామక్రియ
యేమొకో చిగురుటధరమున యెడనెడఁ గస్తురినిండెను ! భామిని విభునకు వ్రాసినపత్రిక కాదుగదా ||పల్లవి||
కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోచిన ! చెలువం బిప్పుడిదేమో చింతింపరె చెలులు ! నలువునఁ బ్రాణేశ్వరుపై నాటిన యాకొనచూపులు ! నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు కాదుగదా ||ఏమొ|| 1
- ↑ ఇది “మరువాకర" కావచ్చును. ఈ పేరియగ్రహారమును అన్నమాచార్యుల కుమారుఁడు పెదతిరుమలాచార్యుఁడు స్వామికి సమర్పించెను.