49
చక్కెరలో తీపు చల్లఁదెమ్మెరలు
చిక్కని కపురంబు జీవరత్నములు
కలయమృతంబు మీఁగడమీదిచవులు
చిలుకుచుఁ గవు లెల్లఁ జేయెత్తిమ్రొక్క (చూ. 33 పుట)
నన్నమయపాడెను. తిరుమలాచార్యుఁడుగాఁబోలును అన్నమాచార్యు సంకీర్తనముల నిట్లు సన్నుతించెను.
సురలకు నరులకు సొరిది వినవిన !
అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥పల్లవి॥
చక్కెరై చవిచూపీ జాలై తావి చల్లీ !
నక్కజపుమాఁతువజ్రాలై మెఱసీని !
నిక్కుటద్దములై మానిలువు నీడలుచూపీ !
నక్కర తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥సుర॥ 1
పన్నీరై పైఁబూసీఁ గప్రంబై చలువ రేఁచీ !
మిన్నగల ముత్యము లై మెయినిండీని !
వెన్ను బలములై మావెంట వెంటఁ దిరిగీని !
అన్నిట తాళ్ళపాకాన్నమయ్య పదములు ॥సుర॥ 2
నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ !
పుట్టుతోనె గురువులై బోధించీని !
గట్టి వరాలిచ్చే శ్రీవేంకటనాథుని మెప్పించీ !
నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు ॥సుర॥ 3
శేషా. వ్రాఁతప్రతి.
వానిని విని యానందపరవశుఁడై నరసింహరాయఁ డాచార్యునిఁ జాల సత్కరించెను. పచ్చలకడియాలు మొదలుగా నాభరణాంబరాదు లొసఁగెను. అన్నమాచార్యుల కాలముననే తాళ్ళపాకవారికి అగ్రహారము లెన్నో ఉన్నట్టున్నవి. ఏలనఁగాఁ దత్పుత్రుఁడు పెదతిరుమలయ్య చాలా అగ్రహారములను స్వామికి సమర్పించెను. అందుఁ గొన్నియేని