Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

జెప్పుకొన్నాఁడు:-

మాళవి


అన్నియు నాయందె కంటి నన్నిటివాఁడా నేనె !
మున్నె నా భావముతో ముడిచివేసినది ॥పల్లవి॥

చెలఁగి సంసారమే చింతించి సంసారినైతి !
ములిఁగి ముక్తి దలంచి ముక్తుండనైతి !
పలుమతాలు దలఁచి పాషండబుద్ధినైతి !
చెలఁగి శ్రీపతి శ్రీవైష్ణువుఁడ నైతి ॥అన్ని॥ 1

పొసంగఁ బుణ్యముసేసి పుణ్యాత్ముఁడనైతి !
పసలఁ బాపము సేసి పాపకర్ముఁడనైతి !
వెసబ్రహ్మచారినైతి వేఱే యాచారమున !
ముసిఁగి మఱొకాచారమున సన్యాసినైతి ॥అన్ని॥ 2

వొగి నొడ్డె భాషలాడి వొడ్డెవాఁడ నైతిని !
తెగి తెలుంగాడ నేర్చి తెలుఁగు వాఁడనైతి !
అగడై శ్రీవెంకటేశ అన్నియు విడిచి నేను !
తగు నీదాసుండనై దాసరినైతి ॥అన్ని॥ 3

అన్న. అధ్యా, 266 ఱేకు.


విజయనగరరాజ్య ప్రధానరాజధాని విజయనగరమే అయినను నరసింహరాయఁ డందు స్థిరవాసముచేయలేదేమో ! రాజ్యసర్వస్వాక్రమణా నంతరమో తత్పూర్వమో కొన్నాళ్ళాతఁడు గొప్పదుర్గమగు పెనుగొండలోఁ గూడ నుండెను గాఁబోలును. అన్నమాచార్యునిఁ బెనుగొండకు రావించుకొని సంకీర్తనములు వినిపింపవేఁడెను.


అన్నమయపాడుట


తేనెలపై తేట తిన్నని చెఱకు
పానకముల నేరుపఱిచిన మేలు