47
తావు లేలే రాజులకు దయ గొంత పుట్టదాయ !
కావరమే ఘనమాయఁ గలికాలమహిమా ॥తతి॥ 4
నిరపరాధులఁ జంపి నెత్తురు వారించఁగాను
తెరల కెట్టుండిరో దిక్పాలులు !
విరసవర్తను లుండే విపరీతకాలమున
గరువాలుం గపటాలె కలికాలమహిమా ॥తతి॥ 5
వుపమించి దంపతులు వొకరొకరినిం జూడ !
చపలదుఃఖములతో సమయఁగాను !
తపములు జపములు ధర్మము లెం దణఁగెనో !
కపురుంబాపాలు నిండెఁ గలికాలమహిమా ॥తతి॥ 6
తలలు వట్టీడువఁగాను తల్లులు బిడ్డల వేయ !
తలఁపెట్టుండెనో యంతర్యామికి !
మలసి ముక్కులు గోయ మరుఁ డెట్టు వోరిచెనో !
కలఁకలే ఘనమాయఁ గలికాలమహిమా ॥తతి॥ 7
దీనతలోఁబడి గుండెదిగు లసురుసురులు !
వాని నెట్లు లోఁగొనెనో వాయుదేవుఁడు !
గూనువంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తిక గోయఁ !
గానఁబడె నింతేసి కలికాలమహిమా ॥తతి॥ 8
పలుమాఱు నమ్మించి ప్రాణములు గొనఁగాను !
యిలఁ దమలోఁ బ్రాణా లెట్లుండెనో !
నెలవై శ్రీవెంకటేశ నీవే యెఱుంగుదువు !
కలుషమే ఘనమాయఁ గలికాలమహిమా ॥తతి॥ 9
అన్న. అధ్యా. 373 ఱేకు.
గజపతులు విద్యానగరము నాక్రమించినప్పు డాతఁ డొడ్డెబాస నేర్చుకోవలసినవాఁ డయినాఁడు గాఁబోలును. దీనిని సంకీర్తనమునఁ