పుట:Annamacharya Charitra Peetika.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 బ్రథమరాజ వంశ్యుఁడగు విరూపాక్షరాయులతర్వాత నావంశము నుత్సారించి రాజ్యమాక్రమించుకొన్నాఁడు. ఇంచుమించుగా నాతఁ డన్నమయవయసు వాఁడు. అతఁడు తొలుత దండనాథుఁడుగా విద్యానగరరాజులక్రిందనుండి యారాజుల దౌర్బల్యముచే సనసన్నగఁ బెంపొంది తుదికి విద్యానగరాధీశ్వరుఁ డయినాఁడు. విద్యానగర మాక్రమించుకొనక పూర్వము క్రీ. 1450 ప్రాంతముల నీతఁడు పొత్తపినాఁటిలోని టంగుటూర దండనాథుఁడై ప్రాభవమున వర్తిల్లుచుండఁ బోలును. అన్నమాచార్యచరిత్రమున నాతఁడు రాచమూఁకలలో బరాక్రమశాలి' యని కలదు. అతఁ డన్నమాచార్యుని వేఁడికొని తనయూరికిఁ బిలుచుకొనిపోయినాఁడు. అపుడు "శ్రీకృష్ణుమన్ననఁ గ్రీడి భూచక్ర ! మేకచక్రంబుగా నేలినపగిది ! నాలాగు మీ సహాయము నాకుఁ గలుగ ! నేలుదు ధరయోల్ల నేకచక్రముగ" నని తనకోర్కి తెల్పుకొన్నాడు. రాయఁడు నన్నమయయుఁ బొంది పొసగి టంగుటూరఁ గొన్నాళ్లుండిరి. అన్నమయ యాశీస్సుచే శ్రీ వెంకటేశ్వరస్వామి దయచే నరసింగరాయఁడు విజయనగరరాజ్య మాక్రమించుకొనెను. తిరుపతి శాసనములఁబట్టియు సాళ్వాభ్యుదయమునుబట్టియు నాతఁడుకొన్నాళ్లు తిరుపతిదగ్గఱిచంద్రగిరిలో రాజ్య మేలినట్లు తెలియనగును. టంగుటూ రాతని జన్మస్థలమో దండనాయకతాస్థానమో కాఁబోలును. విజయనగరరాజ్యపు విప్లవ (విరూపాక్ష చంద్రశేఖరరాయల) కాలమునఁ గాఁబోలును కపిలేశ్వర గజపతి యొకమాఱును, పురుషోత్తమ గజపతి యింకొకమాఱును విజయనగరముమీఁదికి దండెత్తి వచ్చిరి. తొలితూరి కొంతకప్పము చెల్లించి విరూపాక్షరాయఁడు గా(బోలును విజయనగరమును రక్షించుకొనెను. రెండవతూరి పురుషోత్తమగజపతికి సాళ్వనరసింహరాయఁ డుదయగిరిరాజ్యమును నొసంగి విజయనగరమును గాపాడఁగలిగెను. కపిలేశ్వరజగపతి : ప్రసహ్యకర్ణాటమహీపతేఃపరీం నిరుధ్యవిద్యానగరీంనిజైర్బలైః! సమున్నతం మానమివోచ్ఛయంకరం సమాదదే కర్కశచక్రవిక్రమః|