41
భైరవి
చూడుఁ డిందఱకు సులభుఁడు హరి ! తోడునీడ యగు దొరముని యితఁడు || పల్లవి ||
కైవల్యమునకు గనకపుఁదాపల ! త్రోవై శ్రుతులకుఁ దుదిపదమై ! పావన మొకరూపమై విరజకు ! నావై యున్నాఁ డిదే యితఁడు || చూడు || 1
కాపాడఁగ లోకములకు సుజాన ! దీపమై జగతికిఁ దేజమై ! పాపా లడపఁగ భవపయోధులకు ! తేపై యున్నాఁ డిదేయితఁడు || చూడు || 2
కరుణానిధికి రంగపతికిఁ గాంచీ ! వరునకు వేంకటగిరిపతికి ! నిరతి నహెూబలనృకేసరికిఁద ! త్పరుఁ డగుశఠకోపముని యితండు || చూడు || 3
అన్న అధ్యా. 1 వాల్యుం.
అన్నమాచార్యుఁడు మంచిప్రాయముననే రామాయణమెల్ల కీర్తనాత్మకముగా వెలయించెను. (చూ. 30 పుట) అన్నమాచార్యుని సంకీర్తన ములలో రామాయణకథా ఘటితములు చాలఁగలవు. అన్నమయ సంకీర్తన పద్ధతి జగన్మోహనమై ప్రఖ్యాతికెక్కెను. అది విని సాళ్వనరసింగ రాయఁ డన్నమయదర్శన మపేక్షించెను. ఈ నరసింగరాయఁడు టంగుటూరి[1] పాలకుఁ డని నాళీకబాంధవాన్వయుఁ డని యిం దున్నది (చూ. పుట 31) అతఁడు చంద్రవంశమువాఁ డని శాసనములందును గ్రంథములందు నున్నది. ఇందునాళిక 'బాంధవా' ఉండుట 'శాత్రవా' ఉండుటకు వ్రాఁతగాని చేతప్పు గాఁబోలును. నరసింహరాయఁడు విజయనగరపుఁ
- ↑ టంగుటూరు కడపజిల్లా రాజంపేట తాలుకాలో నున్నది