పుట:Annamacharya Charitra Peetika.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43 పురుషోత్తమగజపతి : యస్మైనిత్యతరప్రతాపదహన జ్వాలాయమానధ్వజ 1 స్తంభాబద్ధకుసుంభరక్తవసన ప్రేక్షావిభగ్నద్విషే ! సంధాయాభయయాచనాంజలి మహెూదత్వోదయాద్రింభయా దాత్మానం ముముచే నృసింహనృపతిః కర్ణాటదేశాధిపః || ' చరిత్రకారు లీసందర్భము నిట్లు గుర్తించిరి ! "విషయాసక్తుఁడగు విరూపాక్షరాయని నాతని పెద్దకొమారుఁడగు రాజశేఖరరాయలు చంపించెను. (1478) ఇతనిని ఈతని తమ్ముడగు రెండవిరూపాక్షరాయులు చంపించెను. కాని యీ బ్రాతృహంత పరిపాలనము ప్రజల కిష్టమైనది గాదయ్యెను. అతని దండనాయకుఁడగు సాళువనరసింహరాజు సర్వజనులు తనకు అనుకూలురుకాగా రాజును వెడలఁగొట్టి రాజ్యమును ఆక్రమించుకొనెను. అంత నీప్రథమవంశ మంత రించెను. (1487) తర్వాత సాళ్వనరసింహరాజు 1487 నుండి 1490 దాఁక రాజ్యమేలెను." సాళ్వనరసింగరాయనికి బ్రహ్మహత్యాపాపము చుట్టుముట్టఁగా దానిని మాధ్వమతాచార్యులగు శ్రీపాదరాయలవారు విడగొట్టిరట. ఈ బ్రహ్మహత్యకారణముగాఁ దిరపతి వేంకటేశ్వరస్వామియర్చనము నిలిచిపోఁగా వ్యాసరాయలు పండ్రెండేడు స్వామియర్చనము సలిపి, నెమ్మదిగా మరల వైఖానసులఁ జేర్చిరట! శ్రీపాదరాయాష్టకములో నీ శ్లోక మున్నది. 1. అనంతవర తామ్రాశాసనము, భారతిసంవత్సరాది సంచికలోను, కళింగదేశసంచికలోను ప్రకటితము. 2. మహమ్మదీయమహాయుగము.