Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18



కురువనంబి

కాఁబోది


కురువనంబి తిరుమల కురువనంబి నీ
చరణములే కొలిచి బ్రతికె కిరీటము గలరాజు ॥పల్లవి॥

దవ్వులామటనుండి నీవు పువ్వులఁ బూజించితే అవి!
చివ్వున అప్పనియడుగుఁదామెరలపై చెలఁగియప్పడే నిలిచె!
పువ్వులకు ఱెక్కలున్నవో లేక పుండరీకాక్షుని మహిమో!
నివ్వటిల్లు నీభక్తియోకాని నేఁడు నాతోఁ జెప్పవే ॥కురు॥ 1

పొంకపుదోసిటి యడుసున లెస్స పొరలిన గన్నేరుఁ బువ్వలు!
కుంకుమగంధ మాకల్పములపై కోరివేడి నిలిచె!
బంకమ న్నది యెంతవాసనో లేక పారిజాతముల కెక్కుడో!
వెంకటపతి కెంత వేడుకో నాకు వివరింపవె అప్పయ్య ॥కురు॥ 2

శేషాచార్యులుగారి వ్రాఁతప్రతి.


పెద్దయెక్కుడు


ఇక్కడ మెట్లు నిట్టనిల్వునను చాలాయెత్తుగాను నుండును. తిరుమల యెక్కుటలో నెక్కువశ్రమకర మయినయెక్కు డిది.


కర్పూరవుఁగాలువ


"కపురంపుఁదావులు గడు నూలుకొలువు కపురంపుఁగాలువ" యట. పెద్దయెుక్కుడు దాటినతర్వాత మోఁకాళ్ళ ముడుపునకుఁ బూర్వమీకాలువ గలదట. అక్కడ నాసెలయేటి జాలునీళ్ళు సుగంధము గలిగి యుండునట. సేవాక్రమమున ని ట్లున్నది. "తతఃకర్పూరసురభితీర్థం కర్పూర నిర్‌ఝరమ్"


మోఁకాళ్ళ ముడుపు


సాలగ్రామమయమైనది గనుక నిఁకమీఁదఁ బర్వతము పాదములతోఁగాక మోఁకాళ్ళతో నడచుట జరిగెడిదట. కాన మోఁకాళ్ళ ముడు పని పేరయ్యె నందురు. ఒక్కొకవెుట్టు వెూఁకాలి యెత్తుగలిగి వెూఁకాళ్ళు ముడుచుకొనుచు నెక్కవలెను. గనుక నాపేరయ్యె ననియు నందురు.