Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118 అన్నమాచార్యుఁడొక సంకీర్తనమున: "నే నొక్కండ లేకుండితే నీకృపకుఁ బాత్ర మేది వూని నావల్లనే కీర్తిఁ బొందేవు నీవు." ఆనెను. అతఁడు స్వామి సన్నిధి నివసించి సంకీర్తనములు సాయించుట చేతను. బైయెల్లరు రాజుల నావర్ణించుకొని వారికృతముగాను స్వకృతముగాను ఆలయ గోపురారామ మార్గసోపానాది నిర్మాణములను ఉత్సవవిశేషములను బెంపొందించుటచేతను వైష్ణవమతపు శరణాగతి మాధుర్యము చేతను కలౌ వేంకటనాయక యన్నసూక్తికిఁ దార్కాణముగా లోకరక్షకమై యూపన్నివారకమై ప్రజ్వరిలుచుండు స్వామి మాహాత్మ్య విశేషముచేతను పదునైదవ శతాబ్దిలో తిరుపతి క్షేత్రము భక్తపరిషత్తుల రాకపోక లధికముగా గలదై జనరంజకమై వర్ధిల్లినది. పదునాఱవ శతాబ్దిలో విజయనగరచక్రవర్తి శ్రీకృష్ణరాయఁడు, నంతకుఁ బూర్వుఁడు సాళ్వ నరసింగరాయఁడును దమవిజయము లెల్ల శ్రీవేంకటేశ్వరాను గ్రహమున వెలసినవే యున్న విశ్వాసములగలవారయి దిగ్విజయయాత్రలలో శ్రీవైష్ణవాచార్యులను, కవీశ్వరులను, శ్రీవేంకటేశ్వరవిగ్రహమును దోడఁగొంపోవుచు శ్రీవేంకటేశ్వరభక్తిని దేశ మెల్ల వెల్లివిరియించిరి. దిగ్విజయయాత్రారంభములందు విజయనిర్వాహాంతములందు వారు శ్రీతిరుపతి వేంకటేశ్వరస్వామిదర్శనము చేసికొని కాన్క లర్పించు కొనుచునుండెడివారు. శ్రీకృష్ణరాయఁడు క్రీ 1512 నుండి, 1523 దాఁక నేడు తూరు తిరుపతికి విచ్చేసెను. తొలితూరి:- ఇర్వురుభార్యలతో వచ్చి స్వామికి నవరత్న ఖచిత కిరీటమును కర్పూరహారతికి ఇర్వైమైదు వెండిపళ్ళెములను భార్యలచే స్వామి పాలారగింప బంగారుగిన్నెను. రెండవతూరి:- శ్రీభూదేవుల కనేకాభరణములను, మూదవతూరి:- 5 గ్రామములను, 16