పుట:Annamacharya Charitra Peetika.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

119 నాల్గవతూరి: ముప్పదివేలవరహాలతో స్వామికి కనకాభి షేకమును కొన్ని యాభరణములను తాళ్ళపాక గ్రామమున (చిన్నాదేవిచే) కంఠమాల పదకము ఒక గ్రామమును (తానే) నవరత్స ప్రభావశీయును మకరతోరణమును. అయిదవతూరి:- కంఠమాలను పదకమును అనందవిమానపు బంగారుపూతకు ముప్పదివేలవరహాలను పులికాపునిర్వాహమునకు వెయ్యివరహాలను ఉదయనైవేద్యమునకు 500వరహాలను. ఆఱవతూరి:- కొన్ని భూములను, ఏడవతూరి:- నవరత్నఖచితమయిన పీతాంబరమును నవరత్న ఖచితములయిన రెండువింజామరలను పదకమును పదివేలవరహాలను సమర్పించెను. అచ్యుతరాయుఁడు ప్రతినంవత్సరము స్వామికిఁ బ్రబంధ వుష్పాంజలు లర్పించుచుండెను. సదాశివరాయఁడును స్వామికెన్నో సేవలు చేసెను. దాన శ్రీవేంకటేశ్వరమాహాత్మ్యము దక్షిణభారతదేశమం దెల్లఁ బ్రజ్వరిల్లి నది. పదరునాఱుపదునేడు శతాబుల తెలుగు ప్రబంధములలో శ్రీ వెంకటేశ్వరస్వామికి సమర్పితములే లెక్క కెక్కువగా నున్నవి. పుణ్యక్షేత్ర యాత్రలలో ముఖ్యములయిన యనేకవిష్ణ్వాలయ శివాలయు దేవతలతో పాటుగా నంతదాఁకఁ గీర్తనీయమగుచున్న శ్రీవేంకటేశార్చా మూర్తి పదు నాఅవ శతాబ్ది యారంభమున నుండి సర్వ భారతదేశమునకు ముఖ్యార్చామూర్తి కాఁజొచ్చినది. బ్రాహ్మణులు మొదలుగాఁ బంచముల దాఁక నన్ని జాతులవారును తమయిండ్లలో శు భకార్యములు జరగునప్పడు మనముందుగా వెంకటేశ్వర దీపారాధన, సమారాధన, జరుపుట, ఇంట నెవరికిఁగాని యనారోగ్యము కలిగినప్ప డౌపదమైుక్కులవాఁడని స్వామికి ముడుపు గట్టి కొండకు వచ్చి వడ్డితో ముడుపు చెల్లించుకొనుట సంప్రదాయ మయినది. తలనీలాలిచ్చువారు. నిలువు దోపిళ్ళిచ్చువారు అనర్ఘరత్నా భరణము లిచ్చువారు బ్రహె్మూత్సవ