పుట:Annamacharya Charitra Peetika.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

117 గోచరింపించుచు మహిమాభిరామమై రహికెక్కినది. పలు మతములవారు పలుదెఱఁగుల వేంకటేశ్వరుని భావించుచుండుట నన్నమాచార్యుఁడు వివరించినాఁడు. (చూ. పుట. 253) శివుఁ డని, శక్తి యని, భైరవుఁ డని, జినుఁ డని, స్కందుఁ డని, తమతమ నిర్ణయముల కనుకూలము లయిన రూపురేఖలను బ్రమాణ ములను జూపకొనుచు పలుమతములవారు పలుకుబడి చెల్లించుకొనుచు వైవిధ్యముతో నర్చించుచు వచ్చిన శ్రీవేంకటేశమూర్తిని ఆళ్వారాచార్యుల యభివర్ణనానుగుణముగా విష్ణుమూర్తినిగా శ్రీరామానుజాచార్యులవారు. క్రీ. పదొకొండవ శతాబ్దిలో విఖ్యాతపజీచిరి. సింహాచలము శ్రీకూర్మము మొదలగు స్థలములఁ గూడ నిట్టి నిర్ధారణములే వారు చేసిరట! పర్వతారణ్యమధ్యస్థమై, దుర్గమమై పలుమతముల పలుకుబడికి చెల్లుబడికి లోఁబడుచు, పూజాపురస్కారములు సరిగా సాగక ఎవరో ప్రగాఢభక్తిపరులగు నిశితవ్రతులే నిలువఁదగినట్లున్న స్వామి సన్నిధిని శ్రీవైష్ణవుల స్థానపతిత్వమును స్థాపించి శ్రీరామానుజులు తమకు రామాయణోపదేశము చేసిన గురువులు తిరుమలనంబిగారిని శిష్యులు ఆనందాళ్వార్లను ఇద్దఱు జియ్యంగార్లను ఇర్వదినలుర నేకాంగులను సదా స్వామిని గాచియుండునట్లు చేసిరి. వైఖానసాగమవిధానమునకు తిరుపతి ప్రధానక్షేత్రము. ఇది మధ్య రంగముగా నాంధ్రద్రవిడకర్ణాట దేశములందు విష్ణ్వాలయములలో వైఖానసాగమప్రకారమునఁ బూజోత్సవాదికము లెప్పటనుండియో సాగుచున్నవి. స్వామి కీయుభయులు నుభయరక్షలు. పదునాల్గవ శతాబ్దిలో దేశికులవారును వారిశిష్యులును మనవాళ మహామునులు వారిశిష్యులును స్వామివైభవములకు విఖ్యాతిగూర్చిరి. పదునైదవ శతాబ్దిలో అహెూబలమఠప్రతిష్టాపకులు శఠకోపయతులును, వారి శిష్యుఁడన్నమాచార్యుఁడును స్వామివైభవమునకుఁ బ్రఖ్యాతిగొల్పిరి.