పుట:Annamacharya Charitra Peetika.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

116 ధర్మోద్భోధభూత సారస్యముతో సవరనిభాషతో వేదవేదాంతేతిహాసాది సూక్తి తదర్ధప్రతిపాదనములతో వెల్విరిసి పెరియావాచ్బాంబి శైవంటి మహా వ్యాఖ్యాత వెలసెనేని యఖండానందతాండవముగాఁ బెదపెద్దవ్యాఖ్యా చమత్కారములు త్రవ్వితీయఁదగినట్లు విజ్ఞాననిధులై విరాజిల్లుచున్నవి. తిరువాయ్ మొజి మొదలగు దివ్యప్రబంధరచనల కివి తీసిపోవు. దేశ ప్రజాదౌర్భాగ్యముచే నివి వెలసిననాఁటనుండి నేఁటిదాఁక రహస్య రక్షలో నున్నవేకాని రాణ కెక్కవయ్యెను. అన్నమాచార్యులయుఁ దత్పుత్ర పౌత్రులయుఁ బ్రాభవము చెల్లునప్పుడు వారే స్వామికి వైభవములు కల్పించునప్ప డుత్సవములందేకాక యనుదినమును నీ సంకీర్తనములు స్వామిసన్నిధిని విన్నపించుట జరగినది. తమతర్వాత నట్లు జరగుటకుఁ గూడ వారు వసతులు గల్పించిరి. తర్వాతఁ గొన్నాళ్ళటు తనరెనేమో! ఇందుకుఁదార్కాణగా భజనగోషులవారు తొలుదొలుత తాళ్ళపాకవారి సంకీర్తనములనే యాలాపింతురు. కాని యిటీవల వీనియెఱుక మఱుగు పడిపోయినది. వీనిజన్మస్థానమగు తిరుపతిలోనే వీనిప్రాభవము వెలయ లే దనఁగా నిఁక నితరస్థలములమాట చెప్పనేల? ఈ సంకీర్తనములు తెలునాఁటివిష్ణ్వాలయములలో దివ్య ప్రబంధములుగా నిత్యసంకీర్తనార్హములుగా నెగడఁదగినవి. ఆయాదేవాల యముల యధికారులును ప్రభుత్వమువారును వీని కర్షమయినయా దరము కల్గింతురుగాక! త్యాగరాజకీర్తనలవలె నివి సంగీతపుఁ జమత్కార గములు రాగస్వరవిహారములు పక్కిలించునవిగా నున్నవో లేదో నిరూపించు యోగ్యతనాకు లేదు. గానవిశారదులే దానిఁ గనుఁగొనఁ దగినవారు. ఈ సంకీర్తనఫలములు గాయకులగానామృతమునఁ దోగి మాగి యాస్వాద్యము లయినప్పుడే వానితీయన తెలియనగును. శ్రీవేంకటేశ్వర వైభవము ఉవనిషన్మంత్రములవలె శ్రీవేంకటేశ్వరమూర్తి తొలుత నాయామతములవారికిఁ గొంతకొంత యానుకూల్యము గొల్పు నవయవా లంకారాదికముతో వెలసి తననిజాంతరంగమును నీరు కొలఁదిగా