పుట:Annamacharya Charitra Peetika.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114 పవ్వళించి వుండవలెఁ గాక కాయని కాపులు పూయని పూతలు గట్టి కాపురాలు గుత్తగొందురటే నీవు | 3 శేషా, వ్రాఁతప్రతి. (రాగము పేరు లేదు) కటకటా అయ్యో కాంత నింత యేపుదురా అటమటముగాదు నీయానసుమ్మీ నిజమయ్య పల్లవి| కొసరినా నిన్నే కాని కోపించినా నిన్నే కాని కసరినా నిన్నే కాని కాదన్న నిన్నే కాని విసరినా నిన్నే కాని వేసరినా నిన్నే కాని ఇసుమంతైనా అన్య మెఱుఁగదయ్యా lištoll 1 అలసినా నిన్నే కాని అఁకొన్నా నిన్నేకాని పిలిచినా నిన్నే కాని పేరుకొన్నా నిన్నే కాని సొలసినా నిన్నే కాని సోకనాడినా నిన్నే కాని కలనైనా తలఁ పెందూ కలుగదు గదవయ్యా! కట| 2 కొనియాడినా నిన్నే కాని గుంపించినా నిన్నే కాని పనివినా నిన్నే పాడినా నిన్నే కాని మనసిచ్చి యలమేలుమంగపతి వేంకటేశ యెనసితివి మాచెలి నింక నేచ నేమిటకయ్యా |కట| 3 అళ్వారు - అన్నమాచార్యుఁడు ద్రవిడవేదాంత రచనమునకై శఠకోపయతీంద్రు లవతరించిన విధముగా నంధ్రవేదాంతరచనమునకై యన్నమాచార్యుఁ డవతరించి నాఁడు, శఠకోపయతి వైశాఖమాసమున విశాఖానక్షత్రమున నవతరింపఁగా నన్నమాచార్యుఁడును వైశాఖమాసమున విశాఖానక్షత్రమున నవతరించి