పుట:Annamacharya Charitra Peetika.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

115 నాఁడు. శఠకోపయతి పదునాజేండ్ల వయసువాఁడయిన తర్వాత సర్వ విద్యలు గోచరించి ద్రవిడ సంకీర్తనములు రచింప దైవానుగ్రహమందఁగా నన్నమాచార్యుఁడు నట్లే వదునా అవయేట స్వామి ప్రత్యక్షమై యుద్బోధింపఁగా సంకీర్తరచనము సాగించెను. శఠకోపయతి శ్రీతిరువేంగడ నాథునిమీదను నింక ననేక దివ్యస్థలములలోని విష్ణుమూర్తుల మీఁదను సంకీర్తనములు రచింపఁగా, నన్నమాచార్యుఁడును ప్రధానముగా శ్రీవేంకటనాథునిమీదఁను నింక ననేకపుణ్యస్థలముల విష్ణుమూర్తుల మీఁదను సంకీర్తనలు రచించెను. శఠకోపయతిస్వామి కౌస్తుభాంశమున జన్మించినట్లు విజ్ఞలు విశ్వసింపఁగా నన్నమాచార్యుఁడు స్వామినంద కాంశమున నవతరించినట్లు ప్రాజ్ఞలు పరిగణించిరి. పెరియాళ్వారు (విష్మచితులు) తులసీవనమున జనించిన గోదాదేవిని రంగనాథస్వామి కొసంగి పెండ్లిచేసి మామగా రయినట్లే యన్నమాచార్యులు గూడఁ బద్మసరోవరమున జన్మించినమంగాంబికను వెంకటేశ్వరస్వామి కిచ్చి పెండ్లిచేసి మామగా రయ్యోను. ఇట్టిమహత్త్వముగలవాఁడు గనుకనే తిరుపతివేంకటేశ్వరస్వామి సన్నిధి నీతనికి, నీతనివంశమునకుఁ గూడ నానాఁ డఖండగౌరవ మల వడినది. ఆంధ్రనంకీర్తనము - ద్రవిడ పాశురములు ఆళ్వారు రచింపఁగా నరవమున ద్రావిడవేదమనీ పంచమాగమ మనీ పేర్కొనఁబడుదివ్యప్రబంధము నాలువేలసంకీర్తనములు పాటలు (సీసపద్యాదులవంటివి) కలదికాఁగా అన్నమాచార్యుఁ డొక్కఁడే రచించిన యంధ్రవేదము ముప్పదిరెండువేలపాటలు గలది. ఈ సంకీర్తనలు దివ్య ప్రబంధముల ననువర్తించియే పరమాత్మునకు భక్తజీవులకు పతిపత్నీ భావము నాయికానాయకభావము కల్పించి యుజ్జ్వలరసానుభూతి నొద వించుచు ననేక దేవాలయములలోని యర్బామూర్తుల నభివర్ణించుచు శరణాగతిమహత్త్వమును బ్రతిపాదించుచు నింక ననేకవిధముల లోకనీతి