ఈ పుట అచ్చుదిద్దబడ్డది
113
కేదారగౌళ - ఆటతాళం
నీవు గాఁగా నేను గాఁగా
నేఁటి కాయఁ బోయను।
మీవంటి చులుకనివారము మేమైతే।
మేటైనంతలేసిపనులు నేఁడౌను ॥పల్లవి॥
మంచిగందము నెఱపూఁత పూసుకొని
మావాడ కాతఁడు రాఁగాపోఁగాఁ జూచి।
పొంచులు మాయింటిపంచ నుందువట
బోగాలవారమటే
ఎంచనేటికి తప్ప నీమగఁడైతే
యిలు వెళ్ళకుండ నరికట్టుకొని వల।
పించవలెఁ గాక వూరివారిమీఁద
పొంచు లుండవచ్చునా వోచెలియ ॥నీవు॥ 1
ఎమ్మెకాఁ డాతఁడు మావిథి నిలుచుండి
యెవ్వరితోనో మాటలాడఁగా విని।
కొమ్మరో చూపెట్టుకొనివుందువట
గుట్టు విడిచివున్నామా।
అమ్మరో ఆతఁడు నీమగఁడై తే
ఆన లిడుకొని వుండవలెఁగాక।
దిమ్మరికత్తెవై మాయింటిచుట్టూ
తిరుగులాడ నాయమా ॥నీవు॥ 2
నాయముగా అల మేల్మంగ వెంకటనాథుఁడు
ననుఁగూడి నవ్వినంతలోనే!
వోయమ్మ నేఁజెల్ల వూర నాఁట చాట
వున్న పనులవారమా।
పాయక ఆతఁడు నీపతియైతే పక్క