పుట:Andrulasangikach025988mbp.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకాకుళము తిరునాళ్ళలోని వెలనాటి యువకుల, వితంతువుల దుర్వర్తనలు కవి యెక్కువగా వర్ణించినాడు.

ఇట్టి వింకను చర్చించుకొలది పెరుగుచునే యుండును. కాకతీయుల కాలపు సాంఘిక చరిత్ర కాధారములగు ముఖ్య గ్రంథములలో ముఖ్యమైనది. క్రీడాభిరామము. దీనిని వల్లభరాయలు రచించెనని యున్నను శ్రీనాథుడే రచించినట్లు అడుగడుగునకు శైలి నిరూపిస్తున్నది.

కాకతీయకాలపు సాంఘిక చరిత్రకు ముఖ్యాధారములగు గ్రంథములు

1. క్రీడాభిరామము - వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ప్రచురణము.

2. కాకతీయసంచిక - ఆంధ్రేతిహాస పరిశోధకమండలి, రాజమహేంద్రవరము.

3.పండితారాధ్యచరిత్ర, బసవపురాణము - పాల్కురికి సోమనాథుడు.

4. పల్నాటి వీరచరిత్ర - అక్కిరాజు ఉమాకాంతంగారి ముద్రణము.

5. తెలంగాణా శాసనములు - లక్ష్మణరాయ పరిశోధకమండలి, హైద్రాబాదు.

6. ఉత్తర హరివంశము - నాచన సోమన

7. ప్రతాప చరిత్రము - ఏకామ్రనాథుడు.

8. దశకుమారచరిత్ర - కేతన.

9. నీతిశాస్రముక్తావళి - భద్రభూపాలుడు.


____________