పుట:Andrulasangikach025988mbp.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3 వ ప్రకరణము

రెడ్డిరాజుల కాలము

ఒక సామ్రాజ్యము పడిపోయిన వెంటనే చిన్న సామంత రాజ్యాలు తలెత్తుట భారతీయ చరిత్ర పరిపాటి కాకతీయ సామ్రాజ్యము పడిపోయెను. దాని నాశ్రయించుకొని యుండిన సామంతరాజులు, సేనానులు స్వతంత్ర రాజ్యముల స్థాపించిరి. అందు రెడ్డి, వెలమ రాజుల రాజ్యాలు ముఖ్యమైనవి. అదే సమయమందే విజయనగర రాజ్యము కూడా అంకురించెను. ఈ మూడింటిలో రెడ్డి రాజ్యమే దాని పతనకాలము వరకు ప్రాధాన్యము వహించినందునను, వెలమ రాజ్య పరిస్థితులను తెలుసుకొను ఆధారము లించుమించు లేనివగుట చేతను ఈ కాలమునకు రెడ్డిరాజుల కాలమనియే పేరిచ్చుట యవసరమైనది.

రెడ్డి రాజులు, అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరము, కందుకూరు ప్రాంతాలలో క్రీ. శ. 1324 నుండి ఇంచుమించు 1434 వరకు రాజ్యము చేసిరి. వారి రాజ్యవిస్తీర్ణము కర్నూలు జిల్లానుండి విశాఖపట్టణము జిల్లావరకుండెను. దక్షిణమున నెల్లూరి జిల్లాను ఆక్రమించుకొని ఉండెను.

కాకతీయ సామ్రాజ్య పతనముతో తురకలు తెనుగుదేశ మంతటను వ్యాపించుకొని భయభ్రాంతులైన జనులపై అత్యాచారాలు చేసిరి. దేవళముల పడగొట్టి మసీదులుగా మార్చిరి. బలవంతముగా కత్తిచేతబట్టి జనులను తురకలుగా జేయ మొదలిడిరి. దోపిడీలు, హింసలు మొదలుపెట్టిరి. ప్రజలకు ప్రీతిపాత్రులగు నాయకులను మంత్రులను వారి కండ్లయెదుటనే కాల్చి చంపిరి. శాంత చిత్తులైనవారు రెచ్చిపోయిరి.

ముసల్మానులు ఓరుగల్లును ధ్వంసించిన తర్వాత దేశమందు భీభత్సము చేసిరి. దానిచే చిల్లర రాజులు, వారి సైన్యము, జనులు, అందరును దద్దరిల్లి పోయిరి. తురకను చూస్తే జనులు భయగ్రస్తులై పారిపోవునంతటి భీతాహమును