పుట:Andrulasangikach025988mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జవనిక మున్నగు వాద్యములతో సోదెలు, సుద్దులు, కతలు చెప్పెడువారుండిరి. చలికాలమందు ధనికులు "కాలాగుర్వను లేపనములతో, దట్టు, పున్గు, మృగనాభితో, కస్తూరితో" చలి బాపుకొనుచుండిరి. దుప్పట్లు రెండు మడతలతో కప్పుకొనుచుండిరి. బ్రహ్మణాదులు "క్రొత్త మలకవాళ్ళ" కిర్రు చెప్పుల దొడిగి ఉంకించి నడుస్తూ యుండిరి.

వేశ్యల నుంచుకొనుట, ఆ ఘనకార్యము ప్రకటించుకొనుట- ఆకాలపు రాజులు, సామంతులు, అధికారులు పసందుచేసిరి. నాగన్న మంత్రి "అంగనా హృదయ సరోజ షట్పదము" అట! రాయవేశ్యాభుజంగ వంటి బిరుదులను కొందరు వహించిరి. తుండీర (అరవ) దేశము నుండి పిళ్ళె యొకడు ఓరుగంటిలో భోగముదానితో వివాదపడగా దానిని జారధర్మాసనములో తీర్పుచేసిరి. ఓరుగంటి నగరమున "అగణ్య వస్తువాహన శోభితంబైన వేశ్యా గృహంబులు 12,700 ఉండెను" అని ఏకామ్రనాథుడు, ఇది అత్యంతమగు అతిశయోక్తి, బోగము కన్నెలకు 'కన్నెరికము' పెట్టునపుడు అద్దము చూపించి అలంకరించు వేడుక చేయుచుండిరి.

        "ముకుర వీక్షావిధానంబు మొదల లేక
         వెలపడంతికి గారాదు విటుని గవయ"

ఆంధ్రోర్వీశుమోసాలపై గడియారముండెను. 60 గడియల దినమును పగలు 30, రాత్రి 30 గడియలుగా విభజించి 1 మొదలు 30 వరకు గడియలను కొట్టుచుండిరి.

ఆ కాలమందు గడియకాలములో నీటిలో మునుగునట్లుగా నొక చిల్లిగల గిన్నెను నీటిపై నుంచి అది మునిగిన వెంటనే లెక్కప్రకారము గంట కొట్టుతూ ఉండిరి.

బొమ్మంచు పదమును క్రీడాభిరామములో వాడినారు. "లేత బొమ్మంచుం జిగురాకుమోవిణిసిభాత్వర్థం బనుష్ఠింతునో," పూర్వము యెఱ్ఱని అంచుగల తెల్లని చీరెలు వాడుకలో నుండెను. ఎఱ్ఱని అంచునే బొమ్మంచు అనిరి. లేతయైన బొమ్మంచువంటి ఎఱ్ఱని పెదవులు అని రసిక కవి వాడినాడు.