పుట:Andrulasangikach025988mbp.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలాని కది లేదని తెలిసియు ఏదో సమాధానము వ్రాసితిని. ఇప్పుడు శ్రీ శర్మగారి సూచన సరిఫొయినది.

సంఖ్య (21) "జక్కిణి" దేవర్లకొలుపులు అని రాయలసీమలో బహు ప్రాంతములందు చేయుదురు. ఎవరైన ఒకయింటిలో హఠాన్మరణ మొందిన ఆ యింట కలుగు విపత్తులకా మృతినొందినదయ్యమే కారణమని ఆమెను "జక్కిణి" దేవరగా నిలుపుకొని ఆ యింట వివాహములకు ముందు ఆ దేవరను గొలుతురు. ఒక చిన్నముంత దానికి మూతగా బొంగరమువంటి ఒక చిన్న మట్టిపిడత - ఇట్టివి మూడు జతలు పెట్టి జక్కిణి చిందులతో, వాద్యముతో, పాటలతో కొలుపులు కొలుచువారిని పిలిపించి దేవర్లను కొలుతురు. ఆ కొలుపులోని ఆటకే జక్కిణి అన్నానేమో అని యిప్పుడు నాకు స్ఫురిస్తున్నది.

ఈ కొద్దిపాటి సమాధానము ఆత్మసమర్థనమునకుగాక ఇప్పుడు తోచిన భావాలను వెల్లడించుకొనుటకే యని మనవి.



సమాప్తము.