పుట:Andrulasangikach025988mbp.pdf/431

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తీస్ అనియు, అందురు, అనగా 25, 30 ఇండ్లు కాయలను జరుపుదురు. కాని పాచికల ఆటలో ఎన్ని చుక్కలుపడిన అన్ని యిండ్లే జరుపుదురు. కాయలను జంటగా నడుపవచ్చును. అప్పుడు ప్రతిపక్షి జంటకాయలే వచ్చి వాటిని చంపును. తక్కిన దంతయు ఇంచుమించు పచ్చీసువలె యుండును. పాచికల ఆట యిండ్లు ఇట్లుండును.

ప్రతివారును (8) కాయలు పెట్టుకొని యాడుదురు. తన యింటిని ముందునుండి చావకుండా చుట్టు తిరిగి తన యెదుట మధ్యయింటినుండి మధ్యకు కాయలను నడపుట పండు అగుట యందురు. ఒక్కొకరి కాయల కొకరంగు గుర్తు పట్టుటకై వేసియుందురు.

అయితే యొక్క విశేషమును గమనింపవలెను. నాచన సోమన పర్ణించిన ఆట తెనుగువారి యాటయై యుండును. కర్ణాటకు లది కూడా అదే యాటయై యుండును. ఇప్పటికిని మనవా రాడు ఈయాట ఇంచుమించు సోమన వర్ణించినట్టిదై యున్నది. తమిళులలో దీనిని పోలినయాట యొకటి గలదు. దానిని "కరలు" అందురు. అందు మూడు ఇత్తడి సారెలుండును. ఒకదానిపై