పుట:Andrulasangikach025988mbp.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) 'వైష్ణవము కన్న శైవమే అరవదేశమందు ప్రాచీన తరము' అన్నారు. ఈ సిద్ధాంతము ఇంకా విమర్శనీయము. పరమ ప్రాచీన ద్రావిడ వాఙ్మయములో శివకేశవు లిరువురును గలరు. మరి ఆళ్వార్ల కాల మింకను నిస్సంశయముగా నిశ్చితం కాలేదు. పరస్పర స్పర్ధతోను, సమరసంగానూ ఈ రెండు మతాలూ ప్రవహించినట్లే ఆదినుండి కాన వచ్చుచున్నవి. పు. 20.

అట్లే శ్రీ రామానుజుల కాలమునకు చాలా ముందే వేంకటేశ్వరులను విష్ణుమూర్తిగా ఆరాధించి పాడిన ఆళ్వార్ల సాక్ష్యం సులభముగా త్రీసి వేయరానిది. శ్రీపతి పండితుల భాష్యం పలు సందేహాల కాస్పదమయినది. మరియు చాలా ఆధునికము. రామానుజాచార్యులు చేసినదెల్ల అన్యాక్రాంతమైన మూర్తిని పునస్పాధించడమేనని వారి చరిత్ర. వేంకటేశమూర్తిలో శైవ, వీరభద్ర, స్కంధ, శక్తి చిహ్నాలు కొన్ని కలవనుట సత్యము. దాని నిశ్చిత స్వరూప మిదియని ప్రకృతం నిర్ణయించడం కొంత తొందరపనేమో.

(3) మాహురమ్మకు నగ్నత్వం జైన సంప్రదాయమునుండి వచ్చిందేమో అని శంకించినారు. జైనులలో నగ్న పురుషులున్నారు కాని స్త్రీ దేవతలు అట్టివారొక్కరూ లేరు. ఇదిగాక మనదేశమందలి నగ్నపూజ తాంత్రికము దక్షిణాచారము కన్న ప్రాచీనమైన ఈ వామాచార తంత్ర పంథ బౌద్ధుల మూలాన పరదేశములనుండి మనలో వచ్చి చేరుకున్నదని శోధకులు భావిస్తారు. పు 26.

(4) 'కర్ణాట కిరాట కీచకులు' అని నా పాఠము. కిరాటులు కోమట్లు, లోభులన్నమాట. బోయజాతికి - అందును పల్లకీ మోసేవారికి - ప్రపక్తి లేదనుకొందును. పు. 30.

(5) 'పాలెము' పు. 33. దాక్షిణాత్య పదమను తమ మాటకు ఉత్తరదేశ మందు వ్యవహారంలో లేనిదని అర్థమనుకొంటాను. ఇది ద్రావిడపదం కాదు. పాల్య=పాలింపదగిన-శబ్దము. 'కావలి' అనేఅర్థం తామేవ్రాసినారు. పు. 33.

(6) 'యథార్థముగా బ్రాహ్మణులయందే అన్ని విద్యలు కేంద్రీకృతములై యుండెను'. ఇది తమవంటివారు చెప్పవలసిన అతిశయోక్తి కాదని