పుట:Andrulasangikach025988mbp.pdf/426

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవి; ఇట్టి వాక్యములను అక్షరశ:గ్రహించే అల్పబుద్ధు లెందరో యుందురు కాన, సంస్కృతి, తత్వము-వీరికి సంబంధించిన విద్యలు తప్ప తక్కిన వ్యావహారిక విద్యలన్నీ అందరికీ అందుబాటులో నుండినవే. కనుక రాజులు అపవాదభూతులు కావలసిన డెప్పుడూ లేదని తలంతును. పుట 92.

(7) 'అంతరాళిక యతి గ్రామాబిరామంబుగా' అన్నచోట యతుల సముదాయమనే అర్థము చెప్పుట మేలు. గురులఘుద్రుతాది తాళాంగములను ఒక అందమైన రీతిలో కూర్చుట యతి. ఇది తాళదళ ప్రాణములలో నొకటి. పలువిధములు గలది. అంతేకాని 'జతిగ్రామ విధాన' మను విశిష్టపద్దతి నా దృష్టికి రాలేదు. పుట 122.

(8) పేరంటాలు శబ్దమునకు మీ వ్యాఖ్యయే న్యాయము. సోమశేఖర శర్మగారి అర్థం 'సతి' శబ్దమునకు వలె తాత్పర్యం కావచ్చును. పర్యంత శబ్దం ప్రాకృతంలో 'పేరంతం' అయి తెలుగులో పేరంటము-పేరటముగా మారింది. పేరంటాలు అనగా ఇరుగు పొరుగు స్త్రీ. క్రమంగా శుబాహ్వానానికి తగిన ముత్తైదువ అని చాయార్థం కలిగింది. చేసే శుభానికి 'పేరంటము' పేరైనది. పుట 133.

(9) యక్షకిన్నరాదులు అనార్యులన్నారు. జక్కులు అనునది యక్ష శబ్దభవమని ప్రాకృతవాఙ్మయయం తెలుపుతుంది. కన్నడంలోగూడా 'జక్క' అనే రూపం. అమరసింహుడు - 4వ శతాబ్దంలో యక్షులు దేవయోనులన్నాడు. పరమ ప్రాచీన జైన బౌద్ధవాఙ్మయంనిండా యక్షయక్షిణుల ప్రచారం ఎక్కువగా ఉన్నది. కనుక జక్కులు తెలుగు దేశంవారే అనుట విచారక్షమం కాదేమో. మరియు ఆర్యానార్య శబ్దాలు మన యిప్పటి విజ్ఞానంలో చాలా జాగ్రత్తగా వాడవలసిన వనుకుంటాను. టిబెటులో 'జాక్‌' అనబడు అడవిజాతుల వారున్నారందును, యక్షులదీ ఉత్తర దిగ్బాగమే. ఏమో! పుట 157.

(10) కృష్ణదేవరాయలు హేళనము చేసిన 'రెడ్లు' సామాన్యపు పల్లెకాపులనుకొంటాను. రెడ్డిజాతిని ఆయన పరిహసించెనని తలపనక్కరలేదు. సోమశర్మవంటి కొందరు బ్రాహ్మణబ్రువులను గూడ నితడు పరిహసించెను. కాని అతని బ్రాహ్మణ భక్తి ప్రసిద్ధము. పుట 210.