పుట:Andrulasangikach025988mbp.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాదాబాయి నౌరోజీ లెక్కించి పరిశోదించగా మద్రాసు రాజధానిలో మనిషికి సగటున సంవత్సరాదాయము 18 రూపాయలే అని తేల్చెను. ఉత్తరార్కాటు జిల్లా కలెక్టరు తన జిల్లాలో అపారమైన దారిద్ర్యము జనులలో నిండినదని వ్రాసెను. నెల్లూరు జిల్లాలో అపరాధులు జెయిళ్ళలో పడిన తర్వాత బాగా బలిసిరనియు జనులకు తిండికొరత విపరీతముగా నుండెననియు జిల్లాడాక్టరు అబిప్రాయ మిచ్చెను.'

థాన్యాల యొక్కయు తిండి పదార్థల యొక్కయు ధరలు చాలా తచ్చుగా నుండెను. కృష్ణాజిల్లావారగు పెద్దిబొట్ల వీరయ్య అను వకీలుగారు ఇంచుమించు 27 ఏండ్లక్రిందట ఆంధ్రపత్రికలో ఇట్లు ప్రకటించెను.

'ఇప్పటికి 60 సంవత్సరములకు పూర్వము (1860లో) మచిలీపట్టణములోనుండి ధరలు తెలియగల కాగితమొకటి నేను చూడ తటస్థించినది. ......... 1860 లో బందరులో జరిగిన ఒక వివాహమప్పు డుంచబడిన జాబితా సంగతు లిందు తెలియజేయుచున్నాను.

వస్తువు ధర రూ. అ. పై. పరిమాణము
బియ్యము 1-0-0 32 సేర్లు
కందులు 1-0-0 31 సేర్లు
పెసలు 1-0-0 22 సేర్లు
మినుములు 1-0-0 19 సేర్లు
మిరప 1-6-0 మణుగు
నెయ్యి 4-2-0 మణుగు
ఆముదం 1-0-0 4 వీసెలు
నూనె 1-0-0 4 వీసెలు
చింతపండు 0-13-6 మణుగు
బెల్లం 0-11-8 మణుగు
పసుపు 1-0-0 5 వీసెలు
మెంతులు 1-0-0 40 సేర్లు
జీలకర్ర 1-0-0 6 సేర్లు
కొబ్బరికాయలు 0-3-0 10 కాయలు
సొరకాయలు 0-2-0 3 కాయలు
కట్టెలు 0-3-0 150 మడకర్రలు
విస్తళ్ళు 0-1-4 100
తమలపాకులు 0-1-9 1000
దోసకాయలు 0-2-0 మణుగు
వంకాయలు 0-2-0 మణుగు
ఇంగువ 0-0-10 తులం
అటుకులు 1-0-0 16 సేర్లు
చేటలు 0-1-6 4
తాతి ఆకు బుట్టలు 0-0-3 6