పుట:Andrulasangikach025988mbp.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముద్రితమేకాని శృంగారమంటే భయపడే అధికారుల భయానికేమో దానికి వ్యాప్తి కానరాదు.

సారంగపాణి పదాలు అనునవి కలవు. సారంగపాణి రచనలను రెండు మూడు తావులలో ప్రచురించినారు. అందుచేత పాఠ్యభేదాలు వచ్చినవి. (నావద్ద నున్న 50-60 ఏండ్లనాటి ప్రతి వేరుచో ముద్రితమగు ప్రతితో కొంత బిన్నిస్తున్నది) ఈ పదాలుకూడా చాలా చక్కనివి. దక్షిణమున తంజావూరులోను మధురలోను పాటల నెక్కువగా రచించిరి. అనంత ప్రశస్తమైనవి కాకున్నను సమకూర్పదగినవి. ముద్దుపళని అను నామె రాధికాసాంత్వన మను ప్రబంధము వ్రాసెను. అందు చాలా పచ్చి శృంగారమున్నదని శ్రీ వీరేశలింగముగారు నిరసించిరి. పచ్చిది గర్హింపదగినది. శ్రీనాథాదులలో లేని దిందు హెచ్చుగా లేదను కొందును. ఆమె అష్టపదులు అను పాటల రచించెను. అందు కొన్ని శృంగార గ్రంథమండలివారు రచించిరి. కాని అన్నియు సేకరించి ముద్రించుట అవసరము.

అచ్చు

అచ్చును మొదట కనిపెట్టినవారు చీనావారని యందురు. కాని చారిత్రకముగా క్రీ.శ. 16 వ శతాబ్దిలో ఇంగ్లండులో కాక్‌స్టన్ (Caxton) అనువాడు కనిపెట్టినదే ప్రసిద్ధము. అచ్చుతో నూతన సారస్వత యుగ మారంభ మాయెను. మనదేశములో ఉత్తరమున భూర్జ పత్రాలలోను, దక్షిణమున తాటాకులలోను వ్రాసిరి. గంటముతో తాటాకులపై అక్షరాలు పొంకముగా చెక్కుట ఒక కళ యయ్యెను. అందుచేత అదే వృత్తిగా వ్రాయసకాం డ్రేర్పడిరి. ఒక్క మహాభారతమును పూర్తిగా వ్రాయవలెనంటే ఆరుమాసాలయినా పట్టేది. అందులకుగాను 6 తూముల జొన్నలయినా ఖర్చయ్యేవి. ఒక్కొక్క గ్రంథాని కీ విధముగా వ్యయము చేయవలెనంటే ధనికులయినా కావలెను, లేక పండితులై యావజ్జీవము వ్రాసుకొనువారైనా కావలెను. వ్రాయువారి యవస్థను గురించిన యొక శ్లోకమును పూర్వము చాలా గ్రంథాలతుదిలో యిట్లు వ్రాసేవారు.

        భగ్నసృష్ఠ: కటిగ్రీవ: స్తబ్ధదృష్టి రథోముఖం
        కష్టేన లిఖితం గ్రంథం యత్నేన పరిపాలయేత్.

ఈ నష్టకష్టాల నన్నింటిని అచ్చువచ్చిపోగొట్టి జనులను రక్షించినది. మనదేశములోనికి అచ్చు వచ్చుట క్రీ.శ. 1537 లో. ఆ సంవత్సర మందు