పుట:Andrulasangikach025988mbp.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనులు ఈగలవలె రాలిపోతూవచ్చిరి. రాష్ట్రములోని కొన్ని కరువుల వృత్తాంతము చాలా ఘోరముగా ఉండెను.

క్రీ.శ. 1629-30 లోని కరువులో రొట్టెయిస్తే కన్నబిడ్డను దానికి మారుగా యిచ్చువారుండిరి. జానేబనానే 'ఒకరొట్టెకు ఒక మనిషి' అని ఫార్సీలో అనిరి. కుక్కల మాంసమును మేకమాంసమని అమ్మినవారుండిరి. చచ్చిన ప్రాణుల యెముకలను పిండిచేసి ధాన్యము పిండిలో కలిపి అమ్మిరి. కొందరు మనుష్యులు ఇతర మనుష్యులను తినిరి. మరల 1659లో, 1681 లోను క్షామాలు సంభవించెను. (బిల్ 2-16-17) 1702లో, 1713లో, 1749లో, 1787లో క్షామాలు వచ్చెను. 1769-93 లో తెలంగాణాలో ఘోరక్షామము కలిగెను. హైద్రాబాదు నగరములో 90,000 మంది చచ్చిరి. ఇండ్లలో చచ్చినవారి లెక్క లేనేలేదు. రాయచూరు జిల్లాలో 2000 సాలె వాండ్లలో 6 మంది మాత్రము క్షామానంతరము మిగిలినవారైరి. దేశమంతా చచ్చినవారి పుర్రెలతో నిండెను. అందుచే దాన్ని పుర్రెల కరువు అనిరి (బిల్. 2-25). క్రీ.శ. 1804 లో మరల క్షామము కలిగెను. రూపాయికి 60 సేర్లమ్మే రాగులు రెండున్నర సేరు ప్రకారమయ్యెను. కొందరు మనిషిమాంసమును తినిరి (బి. 2-29). మరల 1831లో క్షామము వచ్చెను. 'పిడికెడు గింజలకు పిల్లలను తండ్రు లమ్ముకొనిరి. జొన్నలు రూపాయికి 3 లేక 4 సేర్లమ్మెను. చెట్ల ఆకులను జనులు మేయదొడగిరి. (బి. 2-29-40). మరల 1854లో మరొక క్షామము వచ్చెను. వీధులలో పీనుగులు నిండియుండెను.

క్షామాల ఫలితముగా జనులు అప్పులపాలైరి. అప్పులిచ్చేవారిలో మార్వాడీలే ఘనులు. కాని వారికంటె ఘోరులున్నారు. కాని అదేలనో వారి నెవ్వరున్నూ స్మరించరు అరబ్బులు, రోహిలాలు హైద్రాబాదు రాజ్యములో 250 ఏండ్లనుండి జనులకు అప్పులిచ్చి ప్రపంచములో కని విని యెరుంగని వడ్డీని వసూలు చేస్తూ వచ్చినారు. ఈనాడు కూడా వారు నూటికి 400 రూపాయిల వడ్డీని వసూలు చేస్తున్నారు. అప్పుల పోతులు బాకీ యియ్యకుంటే జంబియాలతో పొడిచి వసూలు చేసేవారు.

'రైతుల దాన్యాన్ని మార్వాడీలే కొని కోఠాలలో పెట్టి, ధరలు పెంచి అమ్ముచుండిరి. ఆకాలములో మార్వాడీలను గూర్చి యిట్లనుచుండిరి. 'ఒక