పుట:Andrulasangikach025988mbp.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"జమీందారులు-వారి ఆధీనములో నుండే భూమిని పూర్ణమైన స్వాతంత్ర్యము కలిగి ఆయా భూములలోని కాపురస్తులను భర్త భార్యమీద చెల్లించే అధికారముకంటే ఎక్కుడయిన అధికారముతోనే యున్నారు." (32) ఈ వాక్యములు వ్రాసి 120 సంవత్సరాలు గడచిపోయినను ఇప్పటికిని హైద్రాబాదు జాగీర్లలో రైతులు సర్వ'రహితులు'గా నున్నారు. జాగీర్దారులు ఆ 'రహితుల'పై భర్తలు భార్యలపై చెల్లించుకొనే దర్పముకంటే మించిన దర్పాన్ని సాగించు కొంటున్నారు. జాగీర్దార్ల దౌర్జన్యాలను గూర్చి బిల్గ్రామీ ఇట్లు వ్రాసెను.

'ప్రతి గ్రామములో జాగీర్దార్లు వ్యాపారులను భాదించి సరకులపై సుంకాలు లాగుకొనేవారు. అందుచేత క్రీ.శ. 1800 నుండి 1855 వరకు రాష్ట్రములో వ్యాపారము నశించి పోయెను.'

"హైద్రాబాదులో మనుష్యులందరున్ను ఆయుధపాణులై, మెత్తనివారిని కొట్టి నరుకుచున్నారు' (కాశీయాత్ర 34). షహరులో (హైద్రాబాదు నగరంలో) చంపినా అడిగే దిక్కు లేదు. బీదలు ఏ చెట్టు వేసినా వాటిఫలమును క్షేమముగా ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమే యశస్సుగా భావించుకొని యుండే లోకులు అనుభవింపనీయరు. సాత్వికప్రభుత్వము కల రాజ్యములో మెదిగిన వారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆ రాజ్య సంచారమున్ను భయప్రదములుగా ఉంచున్నవి. (కా.36) తుదిమారుగా రజాకరు లీ పైశాచిక ప్రదర్శనము చేసినది వీరాస్వామి నాటి యవస్థాపరిణామమే! "నాగపూరు నివాసస్థులు కృత్రిములు కాని హైదరాబాదు షహరువారి-లె మాటకు మునుపు ఆయుధములు వాడేవారు కారు." ఉత్తరసర్కారులలో నిజాంగారి జమీందారులు చాలా దౌర్జన్యాలు చేసిరి. (బిల్గ్రామి సంపుటం 2 పు 22) పిండారీలు మరాటీదండు దేశాన్ని కొల్లగొట్టుతూ ఉండెను. (20-2-30)

హైద్రాబాదు రాష్ట్రములో ప్రతిదినము బందిపోటు దొంగతనాలు జరుగుచుండెను. రోహిలా గుంపులు, దొంగ గుంపులు గ్రామాలను దోచుకొనుచుండెను. (బిల్గ్రామీ 2-127) బందిపోటు దొంగలలో ఎక్కువ రోహిలాలే యుండిరి. (బి. 2-169)

హైద్రాబాదు రాజ్య మిట్టి దుస్థితిలో నుండుటచేత రాష్ట్రమంతటా వ్యాపారము స్తంభించి వ్యవసాయము నాశనమై, పలుమారు కరువులు వచ్చి,