పుట:Andrulasangikach025988mbp.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు వారు ఇంకా తమ రాజ్యాలను స్థిర పఱచుకునే యత్నములోనే యుండిరి. అందుచేత దేశమందు శాంతి భద్రతలు ఏర్పడలేదు. అయినను బ్రిటిషిండియాలోని భాగాలలో నిజాం రాజ్యములోని భాగాలకంటే శాంతి భద్రత లెక్కువగా ఉండినవని కాశీయాత్ర చరిత్ర నుండి బ్రిల్గామీ వ్రాసిన Hisiorical and descriptive sketches of Hyderabad State గ్రంథము నుండి మనకు తెలియవస్తున్నది.

తెనుగుదేశములోని యిండ్లు ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధముగా నుండెను. రాయలసీమలోని వ్యవసాయకుల యిండ్లలో పశువులున్నూ మనుష్యులున్నూ నివాసము చేయుదురు. ఇది నేటికిని మారకుండా వచ్చిన దురాచారము. కర్నూలు జిల్లాలోని బండాత్మకూరు చేరి వీరాస్వామి యిట్లు వ్రాసెను. పశువులకు తాము కాపుర ముండే యిండ్లకంటే చక్కగా కొట్టములు కట్టి, బాగా కాపాడుచున్నారు. ఆవులను పాలు పితుకుటలేదు. ఎనుపపాడి సహజముగా ఉన్నది. (పుట 11)

రాయలసీమలో ఎద్దుల వృద్ధి నాటికి నేటికి లేదు. "ఎద్దులు నెల్లూరిసీమ నుంచి వచ్చేవారి వద్ద హమేషా వారికి కొనవలసియున్నది. తడవకు 10-20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. (పుట 14)

కర్నూలు జిల్లాలో బియ్యము చాలా తక్కువ. "పేదలు జొన్నలతోనున్ను, ఆరికె యన్నముతోనున్ను కాలము గడుపుచున్నారు. (23)

కృష్ణాజిల్లాలోని ఎద్దులవంటి యెద్దులు దక్షిణ హిందూస్థానములో మరెందును కానరావు. (358)

మచిలీబందరువారిని గూర్చి యిట్లు వ్రాసినాడు.

మనుష్యులు నిండా ఆరోగ్య దృడగాత్రులుగా లేరు. స్త్రీలు అలంకార పురస్సరముగా శోభాయమానులై వున్నారు. చెవులకు నిడువు గొలుసులు వేసికొని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పురుషులు చాయవేసిన వస్త్రప్రియులై యున్నారు. (పుట 350)

'ఈ దేశస్థులు (బందరువారు) కచేరీ సహితముగా విందుచేస్తే ఆ వుత్సవాన్ని మేజువానీ లంటారు.' ఇప్పుడును ఉత్తర సర్కారులో బోగపు సానుల పాట