పుట:Andrulasangikach025988mbp.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కచ్చేరీని మేజువానీ అంటాఆరు. ఇది ఉర్దూ 'మేజుబానీ' నుండి వచ్చిన పదము. అనగా విందు అని యర్థము. విందులో బోగమాట ముఖ్యము.

'కృష్ణానదికి వుత్తరము తూర్పు సముద్రపర్యంతము దేశస్థులు మాట్లాడే తెనుగు మాటలు రాగ సంయుక్తముగానున్న అక్షరలోపము గల హ్రస్వ శబ్దములుగా వుంటున్నవి. స్త్రీలు వోటిని ఆవరించే పాటి ముక్కరలు చాలా లావుగా చేసి ధరించుతారు.' (పుట 353-354)

'నెల్లూరుసీమ పురుషులు స్త్రీలు దేహ పటుత్వము కలవారుగా నున్ను, యథోచితమైన కురుచు రూపము గలిగి సౌందర్యవతులుగా తోచుచున్నది. కాని దేహవర్ణము నలుపు కలసిన చామనగా తోచుచున్నది. గుణము నిష్కాపట్యమని చెప్పవచ్చును. (పుట 393)

'రాజమహేంద్రవరము ధవళేశ్వరము ప్రాంతములో సప్తగోదావరీ భూమిని కోనసీమ అందురు. అక్కడ బ్రాహ్మణులకు భూవసతులు చాలా ఉన్నవి. (పుట-343) 'అచ్చటి బ్రాహ్మణులు చాలా అధ్యయన పరులు, యజ్ఞయాగాది కర్మములయెడల చాలా శ్రద్ధాభక్తి కలిగివున్నారు. ' (పు-344) 'కళింగాంధ్ర దేశములలో తెలగాలనే వెలమలు కలరు.' (పు-344) తెలగాలు వెలమ ఒకే జాతి వారని వీరాస్వామీ వ్రాసినాడు!

'చినగంజాం మొదలుగా సముద్రతీరమందు వుప్పు పయరుచేయడము విస్తారము కనుక వుప్పరజాతి స్త్రీలు దోటి ముక్కరలు ధరింతురు. ఇప్పట్లో దక్షిణ దేశము పడమటి దేశము పొడవుగా భూమి తొవ్వడానకు నెగడి వుండేవారు. ఈ దేశపు వుప్పరవాండ్లున్ను ఓడ్రదేశపు వొడ్డెవాండ్లుగా తోచినది.' (356)

అందుకు సందేహ మక్కరలేదు!

'జగన్నాథ క్షేత్రములో జోగీ జంగము మొదలయిన శైవులను తురకల వలెనే నిషిద్ధ పఱచి గుడిలోనికి రానియ్యరు. హిందువులలో చాకలిజాతిని చండాలురను గుడిలోపలికి రానియ్యరు.' (310)

ఈ రెండు వాక్యాలు తెనుగుదేశానికి సంబంధించకున్నా ఉత్తరసర్కారులకు సమీపముననుండు రాయలసీమలో ఆనాటి యాచారములు తెలియవచ్చును. అందు చాకలివారిని చండాలురవలె చూచినది గమనించదగినది.