పుట:Andrulasangikach025988mbp.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"దశమాతా హరీతకీ" అని వైద్యశాస్త్రము. అది చాలా యుపయోగకారి. చక్కెర పాకులో మురబ్బాగా ఊరవేసిన కరక్కాయ దినమొకటి వంతున ఆరు నెలలు తింటే నరసిన వెంట్రుకలు నల్లనగునందురు. కాని పురుషులకు పుంసత్వమును క్షీణింప జేయుననియు నందురు. ఇచ్చట యతి దాన్ని సేవించుట పుంస్త్వమును తగ్గించుకొనుటకే:

బ్రాహ్మణుల యిండ్లలో 'ద్వారావతిగలంతి' చెంబులు (టూటీదార్ లోటా) లుండెడివి.[1] ఇప్పుడు మట్టిపాత్రలను బ్రాహ్మణు లెక్కువగా వాడరు. వేదకాలమం దవే హెచ్చు. 'మృణ్మయం దేవపాత్రం' అన్నారు. నేటికిని శుభా శుభ కార్యాలకు విధిగా మట్టిపాత్రలే వాడవలెను. తెనాలి రామకృష్ణుని కాలములో బ్రాహ్మణుల యిండ్లలో వంటలు మట్టిపాత్రలందే యెక్కువగా చేసిరి. ఒక బాపనమ్మ 'వార్ధా రాధౌతము కుండయూడ్చి యొసగెన్ రంభాపలాశంబునన్‌' అతిథి ఆ కుందెడు మాయంచేసి 'చూడు మీసారి భాండమో శోభనాంగి' అని కొసరెను. అపుడా యిల్లాలు 'నాథుడు పల్లియకేగి భుజింపకున్కి భరితంబయి అట్టుక నట్టుకట్టి యొప్పు నోదనం బొసగె తదాజ్ఞను శ్రావమూకుటన్‌' అటుకలోని యన్నమును మట్టి మూకుటి (చిప్ప)లో తెచ్చి వడ్డించెను.[2]

నిగమశర్మ ఆంధ్రుడుగానే నిరూపితుడు. ఆతని సోదరి పక్కా ఆంధ్రి. వీరితండ్రి 'కళింగదేశాభరణంబగు పీఠికాపురం బధిష్ఠించి సకల మహీసుసర్వ శ్రేష్ఠుండై వెలిసె'. నిగమశర్మ వ్యభిచారియై ఆస్తినంతయు పోగొట్టుకొన్న విధ మెట్టిదనగా:-

          'దినవెచ్చమునకై తన మేనగల సొమ్ము
               కొదుకక బచ్చింట కుదువవైచు
           ఇందు గీసిన రీతి నించుకించుక చేరి
               గిలుబాడు తల్లిపైగల పసిండి
           తండ్రికి నిడ్డపత్రములు దొంగలిపోయి
               పోయి నంతకునిచ్చి పొరయు గొంత
           మిండ వడ్డికి నోర్చి మృత్యురూపములైన
               సాహులచే ఋణగ్రాహియగుచు

  1. పాండురంగ మాహాత్మ్యము.
  2. పాండురంగ మాహాత్మ్యము 4-132.