పుట:Andrulasangikach025988mbp.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          "ప్రాయంపుపడుచులా పని గొంటివే దూది
           యనెడు పాటల దేనె చినుకులీన"

          "పొసగ చరణాభ ద్రొక్కెడు బొమ్మమీద
           బచ్చెన ఘటింప వడికి రప్పద్మముఖులు"

          "ఎన్నికలు పట్టి పుంజంబు లేర్పరించి
           పంటకర్రలు మరి తోడువడగ లూచ"

          "కండె లొనరించి చాలించి కాపుటింతు
           లున్న యవ్వేళ నద్బుతం బుట్టిపడగ" [1]

ఈనాటి ఖాదీప్రాముఖ్యమునుబట్టి యీ వివరములు తెలుపనైనవి. రాటము యొక్క అంగములపేర్లు చాలావర కిప్పుడు తెలియనివైనవి.

1. కదురు. 2. చెవులు-కదురుపెట్టు తావు. 3. త్రోక్కుడు పలక. 4. దిండు-కదురకు చక్రానికి దారము తగిలింతురు. కదురనకు దారము తగిలించుతావును దిండు అందురు. 5. చక్రము తిరుగుటకై రెండు గుంజ లుండును. వాటిపై చక్రము ఇరుసు తిరుగును. 6. రాటము చక్రమును వ్రేలుపెట్టి త్రిప్పుదురు. దానిని త్రిప్పుడుపుడ కందురు.

త్రొక్కుడుబొమ్మ, చరణాభ, బచ్చెన అంటే యిచ్చట ఏమర్థమో తెలియరాలేదు. చేవపీట.... మూరెడెత్తుది; నాలుగుకాళ్ళు కలది దానికి నులుక

  1. శుకసప్తతి. 2-420 4.