పుట:Andrulasangikach025988mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలెను. వివాహవేదికపై బియ్యము "పోలు" పోయవలెను. దానిపై వధూవరుల కూర్చునబెట్టవలెను. ఇద్దరి చేతులలో జీలకర్రతో కూడిన బియ్యము నుంచవలెను. వివాహవిధానము ముగియగానే వధూవరులు పరస్పర మా జీరికాయుక్త తండులముల చల్లుకోవలెను. వివాహోత్సవములను నాలుగుదినాలు చేయవలెను. నాల్గవదినము రాత్రి వధూవరులను రథాలపై (లేక ఏనుగులపై) నుంచి ఊరేగింపు చేయవలెను. (దానిని ఇప్పుడు మెరవణి యందురు). తక్కినవన్నియు వైదికాచారములై యుండెను. (అభిలషి. ప్రకరణము 7 అధ్యాయం 13 శ్లోకము 1483 నుండి 1512 వరకు), నేటికిని తెనుగుదేశ మందలి వివాహపద్ధతులలో ఒక్కొక్క కులములో ఒక విధమగు వేదభిన్నాచారములు కానవచ్చును. ఇవన్నియు ద్రావిడాచారములే! తాళి (తాడి) బొట్టు - తాటికమ్మలు (తాటంకములు - తాటాకులు) ద్రావిడాచారములే!

వ్యాపారము బండ్లపైనను, ఎద్దుల పైనను, దున్నలపైనను చేయుచుండిరి. పశువులపై వేయు ధాన్యపు సంచులను పెరికలనిరి. వాటిని పశువుపై అడ్డముగావేసి తీసికొని పోయెడివారు (కుమా. 2-73) ఎక్కువ పశువులుండినవారు గుర్తునకై వాటిపై ముద్రలు కాల్చి గుర్తు వేయుచుండిరి. (కుమా. 4-11). జనులలో కొందరికైనా అభిచారము పై (చేతబడి) పై విశ్వాసముండెను (కుమా. 4-91). ఇంద్రజాలము (గారడి) బాగా వ్యాపించియుండెను (కుమా. 6-73). ధనాంజనము మున్నగు అంజనములను బోకిపెంచులపై మంత్రించిన కాటుకనుపూసి పలువుర చేతికిచ్చి చూపించగా అందొకరిద్దరికి కోరిన విషయములు కనబడెడివి. "కర్పరఖండంబున మంత్ర కాటుకతగన్ పాలాక్షు గూర్పింప వగ్గిరిరాజాత్మజపట్టె" (కుమా.6_96). నేటికిని మన దేశమందు కన్నుగల బోకిపెంచును తెప్పించి దానికి సిద్ధము చేసిన ఒక విధమగు కాటుకను పూసి స్థలశుద్ధిచేసి దీపధూపారాధన చేసి టెంకాయకొట్టి కొన్నిమంత్రాలు చదివి అంజనము పట్టింతురు. ఇనుమను బంగారుచేయు రసవాదము నేటిదా? బహుప్రాచీనముది. బహుశా నాగార్జును డీప్రయత్నములో ప్రాచీన ప్రసిద్ధవ్యక్తియై యుండును. నన్నెచోడుని కాలమం దీవిద్యను పలువురు సాధింపబూనిరి. (కుమా. 6-146), ఆపత్కాలములందు నమ్మినదేవునికి ముడుపులు కట్టుచుండిరి (కుమా. 8-64), భరత శాస్త్రముతో భిన్నించిన నాట్యపద్ధతి మనలోనుండెను. "దండలాసక విధమును కుండలియు బ్రెక్కణంబు