పుట:Andrulasangikach025988mbp.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విగాహిత సమస్త శాస్త్రసాగర గరీయ: ప్రతిభులైన తార్కికులును నాదిగా గలుగు విద్వజ్జనంబులుండిరి."

..... ఆది. 1-8

వేదము, తర్కము, న్యాయము, మీమాంస మున్నగు శాస్త్రాలు నేర్పుటకు విద్యాకేంద్రము లుండెను. వాటికి రాజులేకాక ధనికులు, ఉద్యోగులు, విశేషముగా భూదానములు చేసిరి. హైద్రాబాదు రాజ్యములోని వాదీస్టేషన్‌కు సమీపమందు పూర్వము నాగ వాపి అను స్థలముండెను. దానినిప్పుడు 'నాగాయి' అందురు. అచ్చటి శాసనములు కొన్నింటిని అర్షశాఖవారు ప్రకటించినారు. వాటినిబట్టి క్రీ.శ. 1100 ప్రాంతములందచ్చట ఒక గొప్ప కళాశాల యుండెననియు, అందు శైవాగమములు, తర్కన్యాయములు, వేదములు, శాస్త్రములు' మున్నగునవి బోధించుచుండిరనియు, విద్యార్థులకు, ఆచార్యులకు అందే వసతులు నిర్మించిరనియు, అధ్యాపకుల జీవనార్థమై కొంత భూమిని ప్రత్యేకించి విద్యార్థులభుక్తికై మరికొంత భూమిని ప్రత్యేకించిరనియు, అందు గ్రంథాలయముకూడ నుండెననియు, ఇట్టి యపూర్వవిశేషములు దానినుండి విశదమగును. అతి ప్రచారమువలన తక్షశిల, నాలందా విద్యాపీఠములను గురించి విద్యావంతులు తెలుసుకొన్నారు. కాని "నాగాయి" పేరెత్తినవారు లేరు. ఉత్తర హిందూస్థానములో ముసల్మానుల దాడు లంతవరకే ప్రారంభమై ప్రసిద్ధ విద్యాపీఠములును, గ్రంథాలయములును ధ్వంసింపబడెను. దక్షిణ హిందూస్థానమునకు 1723 వరకీ బాధలు లేకుండెను.

వైదికాచారములకు భిన్నముగా దక్షిణ హిందూస్థానమందు ప్రాచీనము నుండియు అనేక ద్రావిడాచారములు కనులందు నిలిచిపోయెను. ఈ విభిన్నాచారములను బట్టి ఆర్యద్రావిడ విభాగమును అంగీకరింపవలసి వచ్చును. అటులే ద్రావిడ భాషలపై సంస్కృత ప్రభావము అత్యంతముగా కలిగినను అవి భిన్న భాషలే యనవలెను. తెలుగువారిలో పెండ్లిండ్లు నాలుగు దినముల వరకు జరుగుచుండెను. ఉత్తర పెండ్లి అయిన తర్వాత "దినచతుష్టయానంతరమున" బంధువులు వెడలిపోవుచుండిరి. (ఉద్యోగ.1-2 ఈ విషయము సంస్కృతమూలమున లేదు.) మేనమరదలి పెండ్లాడు