పుట:Andrulasangikach025988mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమారసంభవము, మద్రాసు యూనివర్సిటీ ప్రచురణము) ఈ జాను తెనుగునే పలుమారు పాల్కురికి సోముడు తన కృతులందు వర్ణించి తన వృషాదిప శతకములో అదెట్టిదో ఒక పద్యముతో నిరూపించెను. అందే మణిప్రవాళము అను ఒక విధమగు సంస్కృతాంధ్ర సమ్మిశిత రచనను నిరూపించి రెండు పద్యాలు వ్రాసెను. అతని తర్వాత మణిప్రవాళము తెనుగులో లేకపోయెను. అది తమిళములో కలదని శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు తమ భారతవ్యాసములందు తెలిపినారు.

కవితలో దేశికవిత, మార్గకవిత యను భేదముండెనని నన్నెచోడుడు మొదట తెలిపెను. కవితయందేకాక నృత్యమందును, సంగీతమందును ఇదే భేదముండెనని శ్రీనాథుని కాలమువరకు సూచనలు కలవు. మార్గవిధానము అనునది సంస్కృతమర్యాద. వాల్మీకి రామాయణమందే తర్వాతివారేమో కుశలవులు రామకథను "అగాయతాం మార్గవిధాన సంపదా" అని వ్రాసినారు. దేశీమార్గభేదములు దక్షిణదేశమందు సంస్కృతమునుండి భిన్నించిన భాషాసంగీత నాట్యవిధానములకు క్రీస్తుశకము 9 వ శతాబ్దమునుండి నిర్ణయించిన స్వరూపు మనవచ్చును.

చాళుక్యరాజులే దేశికవితను ఆంధ్రదేశమందు నిలిపిరని నన్నెచోడుడనెను. (కుమా. 1-23) తన కాలమందు దేశిసత్కవు లుండిరనెను. (కుమా. 1-24) కుమారసంభవమే మన మొదటి ప్రబంధ మనవచ్చును. అష్టాదశవర్ణనలు, నవరసములు, 76 అలంకారములు ఉత్తమ కావ్యలక్షణాలనెను. (కుమా 1-45) జనులలో ఊయెలపాటలు (4-89) గౌడు గీతములు (6-45) ప్రచారములో నుండెను. జనుల విద్యాభ్యాసము "ఓం నమ:శివాయ"తో ప్రారంభమగు చుండెను. (కు. 3-34). ఆ కాలములో వేదపఠనము, శాస్త్రపఠనము విశేషముగా నుండెను. నన్నయ సహాధ్యాయియు, భారతరచనలో నీతనికి తోడ్పడిన వాడును వానసవంశీయుడగు నారాయణభట్టు సంస్కృత కర్ణాట ప్రాకృతపైశాచికాంధ్ర భాషలలో కవిశేఖరుడు. అష్టాదశావధాన చక్రవర్తి వాఙ్మయదురంధరుడు. రాజరాజ నరేంద్రుని యాస్థానమందు "అపారశబ్ద శాస్త్రపారగులైన వైయాకరణులును, భారత రామాయణాద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులును, మృదుమధుర రసభావభాసురసనార్థవచన రచనా విశారదులైన మహాకవులును, వివిధ తర్క